JEE Advanced Result 2023: విడుదలైన JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలు.. సత్తా చాటిన హైదరాబాదీ.. డైరెక్ట్ లింక్ నుంచి ఇలా చెక్ చేయండి..
IIT గౌహతి JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (IIT గౌహతి) JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. అభ్యర్థులు ఫలితాన్ని తనిఖీ చేయడానికి ఇక్కడ ఇచ్చిన స్టెప్పులను అనుసరించవచ్చు.
ఈ ఏడాది పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. రెండో షిప్టును మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్ష తాత్కాలిక సమాధానాల కీలు జూన్ 09, జూన్ 11 న విడుదల చేయబడ్డాయి. అనంతరం పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఫలితాన్ని చెక్ చేయడానికి, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023లో మొత్తం 1,80, 372 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ ఏడాది పరీక్షలో హైదరాబాద్ జోన్‌కు చెందిన వీసీ రెడ్డి టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్షను మొత్తం 360 మార్కులకు నిర్వహించారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పేపర్లు ఉన్నాయి. మొత్తం మూడు పేపర్లను రెండు షిఫ్టుల్లో 60-60 మార్కులకు నిర్వహించారు. ఇది కాకుండా, పరీక్ష తుది సమాధాన కీని కూడా IIT గౌహతి విడుదల చేసింది.
ఇలా ఫలితం చూడండి ..
స్టెప్ 1: JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించండి . స్టెప్ 2: తర్వాత అభ్యర్థి హోమ్ పేజీలో రిజల్ట్ సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి. స్టెప్ 3: దీని తర్వాత, విద్యార్థులు తమ లాగిన్ ఐడిని నింపి, ఆపై దానిని సమర్పించండి. స్టెప్ 4: ఇప్పుడు విద్యార్థి ఫలితం కనిపిస్తుంది. స్టెప్ 5: ఆ తర్వాత విద్యార్థి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి. స్టెప్ 6: చివరగా, విద్యార్థి ఫలితం ప్రింట్ అవుట్ తీసుకోండి.
మరిన్ని కెరీర్ న్యూస్ కోసం