Illegal Affair: ఉద్యోగులూ బీకేర్‌ఫుల్.. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే జాబ్ ఊడినట్లే.. మామూలు వార్నింగ్ కాదిది..
Extramarital affairs: వివాహేతర సంబంధాలు చాలా కుటుంబాలను కుల్చేస్తున్నాయి.. వేరే వారి మోజులో పడి చాలా మంది బంధాలకు పుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు. రిలేషన్‌షిప్‌లో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే.. జీవితం చిన్నాభిన్నం అవ్వడం ఖాయం..
Extramarital affairs: వివాహేతర సంబంధాలు చాలా కుటుంబాలను కుల్చేస్తున్నాయి.. వేరే వారి మోజులో పడి చాలా మంది బంధాలకు పుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు. రిలేషన్‌షిప్‌లో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే.. జీవితం చిన్నాభిన్నం అవ్వడం ఖాయం.. ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పై ఓ చైనా కంపెనీ ముందే అలర్ట్ అయింది.. ఈ మేరకు ఉద్యోగులకు వింత ఆదేశాలు..అంటే కీల గైడ్లైన్స్ జారీ చేసింది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎవరూ వివాహేతర సంబంధాలు పెట్టుకోరాదని.. అలా పెట్టుకుంటే చర్యలు తప్పవంటూ నిబంధనలు జారీ చేసింది. అలాగే, ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉంటే.. విడాకులు కూడా ఇవ్వొద్దంటూ స్పష్టంచేసింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే.. అలాంటి ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ వింత ఆదేశాలను సదరు కంపెనీ.. జూన్ 9న జారీ చేసినట్లు చైనా మీడియా వెల్లడించింది.
ఈ నిబంధనపై చైనా సహా.. పలు ప్రాంతాలల్లో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం కాస్త.. రచ్చ రచ్చగా.. అంతర్జాతీయ మీడియాలో ముఖ్యాంశాలుగా మారింది. కంపెనీ అంతర్గత సంబంధాలు, నిర్వహణను మెరుగుపర్చడం కోసమే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఈ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. కుటుంబానికి విశ్వాసంగా ఉండడం, దంపతుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పే సంస్కృతిని బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. వివరించారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటేనే ఉద్యోగుల పనితీరు కూడా బాగుంటుందని దీనికి అనుగుణంగా మార్గదర్శకాలను, నిబంధనలను రూపొందించామన్నారు.
ఇదిలాఉంటే.. ఈ నిబంధలపై చైనా సోషల్ మీడియా సహా పలు చోట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై నిబంధనలను రూపొందించడం సరికాదని.. కొందరు పేర్కొంటుండగా.. మరికొందరు కుటుంబాలు నిలబడతాయని.. విలువలు పెరుగుతాయంటూ వాదిస్తున్నారు. అయితే, ఓ ఉద్యోగిని తొలగించడానికి అతని పనితీరు, వ్యక్తిగత కారణాలు మాత్రమే న్యాయస్థానంలో చెల్లుబాటు అవుతాయని, ఇలాంటి నిబంధనలు మాత్రం చెల్లుబాటు కావంటూ పేర్కొంటున్నారు న్యాయనిపుణులు..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..