- Telugu News Photo Gallery Relationship Tips in Telugu: men should stay away from these types of things
Relationship Tips: మగాళ్లూ బీకేర్‌ఫుల్.. ఇవి తింటే ఆ సామర్థ్యం తగ్గడంతోపాటు సంతానం కష్టమేనట..
Relationship Tips: ఈ రోజుల్లో పురుషులు వంధ్యత్వ సమస్యతో పోరాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం అని నిపుణులు పేర్కొంటున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యతోపాటు లైంగిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి.
Updated on: Jun 06, 2023 | 8:49 PM

Relationship Tips: ఈ రోజుల్లో పురుషులు వంధ్యత్వ సమస్యతో పోరాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం అని నిపుణులు పేర్కొంటున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యతోపాటు లైంగిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి. ఆహారం నేరుగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది కావున సమస్యలు మరింత పెరుగుతాయి.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచుకోవచ్చు.. శరీరాన్ని చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో పురుషులు తినకూడని పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

ప్రాసెస్ చేసిన మాంసం: బయట దొరికే ప్రాసెస్ చేసిన మాంసం శరీరానికి హానికరం. దీన్ని తీసుకోవడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్య మరింత పెరుగుతుంది. అంతే కాదు, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. అందుకే ఈరోజు నుంచే ప్రాసెస్ చేసిన మాంసం ఆహార పదార్థాలను బంద్ చేయండి..

తీపి పదార్థాలు: రోజూ తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతుంది. అదే సమయంలో, తీపి పదార్థాల వినియోగం స్పెర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందుకే పురుషులు ఎక్కువగా స్వీట్లు తినకూడదు.

అధిక ఉప్పు పదార్థాలు : ఉప్పు డేంజర్.. సోడియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు పురుషులలో వంధ్యత్వాన్ని పెంచడానికి పని చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు తండ్రి కావాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు నుంచి పిజ్జా, బర్గర్, నూడుల్స్ వంటి వాటి వినియోగాన్ని తగ్గించండి.

ధూమపానం: సిగరెట్ తాగుతుంటుంటే.. ఇప్పటికైనా జాగ్రత్త పడండి.. ఎందుకంటే పురుషులలో వంధ్యత్వానికి ఇది అతిపెద్ద కారణం ధూమపానం. ధూమపానం శరీరానికి హానికరం. మీరు రోజూ సిగరెట్ తాగితే, స్పెర్మ్ తగ్గడంతో పాటు, దాని నాణ్యత కూడా తగ్గుతుంది.

మద్యం: పురుషులు పొరపాటున కూడా మద్యం సేవించకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అందుకే అనారోగ్యానికి గురి చేసే ఆహార పదార్థాలను తినకపోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు..





























