- Telugu News Photo Gallery Cricket photos Team india and ipl team Rajastan Royals fast bowler prasidh krishna got engaged with his lover rachana before wtc final 2023
Team India: పెళ్లి పీటలు ఎక్కనున్న మరో టీమిండియా క్రికెటర్.. వైరలవుతోన్న ఎంగేజ్‌మెంట్ ఫొటోస్..
Prasidh Krishna: భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి ముందు నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Updated on: Jun 06, 2023 | 9:21 PM

టీమిండియా ఆటగాడు, కర్ణాటక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు రచనతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

తాజాగా జరిగిన పసుపు వేడుకలో దేవదత్ పడిక్కల్, జగదీష్ సుచిత్, శరత్ బీఆర్ వంటి కర్ణాటక ఆటగాళ్లు కనిపించారు.

దీంతో ప్రసిద్ధ్ కృష్ణ, రచనల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఒక ఫొటోలో అతను తన కాబోయే భార్య మెడ చుట్టూ చేయి వేసి కూర్చున్నాడు. రెండవ చిత్రంలో వ్యతిరేక దిశలో తన కాబోయే భార్యతో కూర్చున్నాడు. ఈ రెండూ ఫొటోల్లో పసుపు రంగులతో మునిగిపోయారు.

2021లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడాడు. 5.32 సగటుతో పరుగులు ఇచ్చి మొత్తం 25 వికెట్లు పడగొట్టాడు.

అలాగే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన బౌలర్‌గా నిలిచాడు. గాయం కారణంగా ఈసారి ఆడలేదు. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 51 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక స్పీడ్‌స్టర్ 49 వికెట్లు పడగొట్టాడు.





























