Damask Rose: ఈ గులాబీ నూనె కాస్టిలీ గురూ.. కిలో రూ.12 లక్షలు.. ఈ పువ్వుల పెంపకం రైతుకు లాభాల పంట

ఈ గులాబీ పువ్వుల ధర కూడా సాధారణ గులాబీ కంటే అధికం. సిరియాలో పుట్టిన డమాస్క్ గులాబీని ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో సాగు  చేస్తున్నారు. మనదేశంలో అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఈ గులాబీ సాగు చేసేందుకు రైతులకు శిక్షణ ఇస్తున్నారు. పెర్ఫ్యూమ్‌లు, సుగంధ ద్రవ్యాలను డమాస్క్ రోజ్ నుండి తయారు చేస్తారు.

Damask Rose: ఈ గులాబీ నూనె కాస్టిలీ గురూ.. కిలో రూ.12 లక్షలు.. ఈ పువ్వుల పెంపకం రైతుకు లాభాల పంట
Damask Rose Oil
Follow us
Surya Kala

|

Updated on: Jun 18, 2023 | 9:39 AM

గులాబీ పువ్వులు అంటే చాలు ప్రేమికులు గుర్తుకొస్తారు. ప్రపంచ వ్యాప్తంగా గులాబీ పువ్వులకు ప్రేమికులుంటారు. మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో గులాబీలను సాగు చేస్తారు. సుగంధ ద్రవ్యాలు, సుగంధ నూనెలు, సౌందర్య ఉత్పత్తులు గులాబీల నుంచి తయారు చేస్తారు. అయితే డమాస్క్ రోజ్ మాత్రం మిగిలిన గులాబీ పువ్వుల కంటే భిన్నం. హైబ్రిడ్  రకం గులాబీ.. ఈ గులాబీ పువ్వుల ధర కూడా సాధారణ గులాబీ కంటే అధికం. సిరియాలో పుట్టిన డమాస్క్ గులాబీని ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో సాగు  చేస్తున్నారు. మనదేశంలో అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఈ గులాబీ సాగు చేసేందుకు రైతులకు శిక్షణ ఇస్తున్నారు. పెర్ఫ్యూమ్‌లు, సుగంధ ద్రవ్యాలను డమాస్క్ రోజ్ నుండి తయారు చేస్తారు. అంతేకాదు పాన్ మసాలా, రోజ్ వాటర్‌ తయారీకి, ఆహారాన్ని రుచిగా మార్చడానికి, అలంకారంగా, హెర్బల్ టీగా కూడా ఈ గులాబీలను ఉపయోగిస్తారు. పూల రేకులు కూడా తినదగినవి.

కిసాన్ తక్ నివేదిక ప్రకారం.. డమాస్క్ గులాబీ నాణ్యత బాగుటుంది కనుక ఈ గులాబీకి క్రమంగా భారతదేశంలో కూడా డిమాండ్ పెరుగుతోంది. ఏఈ గులాబీలనుంచి తీసే నూనె కిలో 10 నుంచి 12 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. కనుక మన రైతులు డమాస్క్ గులాబీని పండిస్తే.. భారీ లాభాలను పొందవచ్చు.

హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బిటి) డమాస్క్ రోజ్‌పై నిరంతరం పరిశోధనలు చేస్తోంది. తద్వారా రైతు సోదరులు ఈ గులాబీని సాగు చేసి తద్వారా బాగా సంపాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

పెర్ఫ్యూమ్ తయారీలో డమాస్క్‌ రోజ్‌

మార్కెట్‌లో డమాస్క్‌ రోజ్‌ ధర డిమాండ్‌ను బట్టి ధరలో హెచ్చు తగ్గులుంటాయి. అయినప్పటికీ ఈ గులాబీ నుంచి తీసిన నూనె ధర ఎప్పుడూ 10 నుంచి 12 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. ఒక కిలో నూనెను తీయడానికి రోజుకు మూడున్నర టన్నుల డమాస్క్‌ గులాబీలు కావాల్సి ఉంటుంది. కనుక ఈ గులాబీల నుంచి తీసిన నూనె చాలా ఖరీదు. మరొక కారణం ఏమిటంటే.. డమాస్క్ గులాబీ దిగుబడి చాలా తక్కువ. దీని ఆయిల్ ఎక్కువ ధరకు అమ్ముడుపోవడానికి కారణం ఇదే. అయితే, నూనెను తీసే సమయంలో, రోజ్ వాటర్ కూడా వస్తుంది. ఇది సాధారణ రోజ్ వాటర్ కంటే చాలా సువాసన కలిగి ఉంటుంది. పెర్ఫ్యూమ్‌లను తయారు చేయడానికి ఈ గులాబీల నూనె కొన్ని చుక్కలు చాలు..

ఏ విధంగా నిల్వ చేయాలంటే.. 

ఐహెచ్‌బిటి ఇంజనీర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ.. డమాస్క్‌ పువ్వుల నుండి తీసిన నూనె లేదా రసం నుండి తయారుచేసిన పెర్ఫ్యూమ్‌ను గాజు సీసాలో నిల్వ చేయకూడదని తెలిపారు. ఈ నూనెలో 100 నుండి 150 సమ్మేళనాలు ఉంటాయి. వీటిల్లో 15-16 సమ్మేళనాలు నూనె రూపంలో ఉంటాయి. కనుక ఈ పూల నూనెను గాజు సీసాలో నిల్వ చేస్తే సూర్య రశ్మి ఈ నూనెపై పడుతుంది. అప్పుడు సమ్మేళనం క్షీనిస్తుంది, అప్పుడు నూనె నాణ్యత కోల్పోతుంది. కనుక ఈ పువ్వుల నూనెను అల్యూమినియం సీసాలో మాత్రమే నిల్వ చేయాలనీ సూచించారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..