AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Heat Waves: చైనాలో రికార్డ్ స్తాయిలో ఉష్ణోగ్రత.. భారీగా విద్యుత్ వినియోగం ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం..

జూన్ నెలలో ఉత్తర చైనాలోని అనేక నగరాల్లో అన్ని ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి ఆ దేశ అధికారులు రంగంలోకి దిగి మాక్ ఎమర్జెన్సీ డ్రిల్ నిర్వహించారు.

China Heat Waves: చైనాలో రికార్డ్ స్తాయిలో ఉష్ణోగ్రత.. భారీగా విద్యుత్ వినియోగం ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం..
China Heat Waves
Follow us
Surya Kala

|

Updated on: Jun 18, 2023 | 8:40 AM

ప్రపంచం ప్రమాదం అంచున ఉందా.. కాలాలు తమ గమనాన్ని మార్చుకున్నాయా.. వేసవి లో వర్షాలు.. శీతాకాలంలో వేసవి కాలాన్ని తలపించే ఎండలు ఇలా కాలచక్రం గమనం తప్పుందా అనిపించక మానదు ఎవరికైనా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే.. తాజాగా మన పొరుగుదేశం చైనాలో రికార్డ్ ఎండ వేడి రికార్డ్ బ్రేక్ చేసింది. జూన్ నెలలో ఉత్తర చైనాలోని అనేక నగరాల్లో అన్ని ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి ఆ దేశ అధికారులు రంగంలోకి దిగి మాక్ ఎమర్జెన్సీ డ్రిల్ నిర్వహించారు. ఏప్రిల్ నెల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చైనా కలవరపడుతోంది. అప్పటి నుంచి ఆ దేశంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

వడగాల్పులతో ఇబ్బందిపడుతున్న చైనీయులు 

వాతావరణ నిపుణులు రాబోయే కాలంలో చైనాలోని పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అంచనా వేశారు. అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావచ్చు అని తెలిపారు. హెబీ ప్రావిన్స్ రాజధాని షిజియాజువాంగ్‌లో గురువారం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిందని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిన మొదటి ప్రాంతీయ రాజధానిగా షిజియాజువాంగ్‌ రికార్డ్ సృష్టించింది.

ఇవి కూడా చదవండి

గత రికార్డులను బీట్ చేసిన పలు ప్రాంతాలు 

చైనీస్ న్యూస్ మీడియా CCTV ప్రకారం.. జూన్‌లో హెబీ ప్రావిన్స్‌లోని జాంగ్జియాకౌ, చెంగ్డేలో ఉష్ణోగ్రత రికార్డ్ స్థాయిలో ఉండి.. గత రికార్డులను బద్దలు కొట్టింది. మరోవైపు రాజధాని బీజింగ్‌లోనూ ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతూనే ఉంది. బీజింగ్ లో శనివారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఇక్కడ 39.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఈ ఎండ వేడి మరింత పెరగవచ్చు అని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

చైనా పవర్ గ్రిడ్ అప్రమత్తం..

చైనాలో రోజురోజుకీ పెరుగుతున్న వేడి కారణంగా.. స్థానిక పవర్ గ్రిడ్ ఆపరేటర్లు ఇప్పటికే హై అలర్ట్‌ ను ప్రకటించారు. అంతేకాదు దక్షిణాదిలోని కొన్ని నగరాల్లో, సంస్థలు, ప్రజలు తక్కువ విద్యుత్తును ఉపయోగించాలని కోరారు. రాష్ట్ర గ్రిడ్ తూర్పు చైనా నెట్‌వర్క్‌పై చైనా నేషనల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ గురువారం మాక్ ఎమర్జెన్సీ డ్రిల్ నిర్వహించింది. ఈ డ్రిల్ విద్యుత్ డిమాండ్ పెరుగుదలపై ముందస్తు హెచ్చరిక.. పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందించడం ప్రధానాశం.

తూర్పు చైనా ప్రాంతీయ గ్రిడ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ షాంఘై, హాంగ్‌జౌ వంటి ఆర్థికంగా ప్రధాన నగరాలకు విద్యుత్ సరఫరా చేస్తుంది. అయితే ఈ వేసవిలో విద్యుత్ వినియోగం 397 గిగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ 2021 గణాంకాల ప్రకారం ఇది జపాన్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ.

శతాబ్దంలో అత్యధిక ఉష్ణోగ్రత షాంఘైలో నమోదు  విశేషమేమిటంటే గత నెల మేలో షాంఘైలో శతాబ్దంలో అత్యంత ఉష్ణోగ్రత నమోదైంది.  రోజు రోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో  ప్రజలకు విద్యుత్, నీటి వినియోగం కోసం ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..