US Green Card: మోడీ పర్యటనకు ముందు భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్‌.. గ్రీన్‌కార్డు నిబంధనలు మార్పు.. కొత్త మార్గదర్శకాలు విడుదల

ప్రధాని మోదీ పర్యటనకు ముందు అమెరికా ప్రభుత్వం భారతీయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా ప్రభుత్వం మార్చింది. విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే అర్హత నిబంధనలను..

US Green Card: మోడీ పర్యటనకు ముందు భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్‌..  గ్రీన్‌కార్డు నిబంధనలు మార్పు.. కొత్త మార్గదర్శకాలు విడుదల
Us Green Card
Follow us
Subhash Goud

|

Updated on: Jun 17, 2023 | 9:19 PM

ప్రధాని మోదీ పర్యటనకు ముందు అమెరికా ప్రభుత్వం భారతీయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా ప్రభుత్వం మార్చింది. విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే అర్హత నిబంధనలను మార్చారు. అమెరికా ప్రభుత్వం ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆహ్వానంతో ఈ నెల 21 నుంచి 24 మధ్య మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. . అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో కూడా మోదీ ప్రసంగిస్తారు. మోదీ గౌరవ సూచికంగా వైట్‌హౌస్‌లో బైడెన్‌ దంపతులు స్టేట్‌ డిన్నర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

గ్రీన్‌ కార్డుల జారీ విషయంలో అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ భారతీయ టెకీలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. అమెరికాలో స్థిరపడాలన్న వాళ్ల కల నెరవేరబోతోంది. గ్రీన్‌ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.

ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డ్ లను ఇస్తుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ చట్టం ప్రకారం.. ప్రతి ఏటా రు 1,40,000 గ్రీన్‌ కార్డులను జారీ చేస్తుంది. అయితే ఒక్కో దేశానికి పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని జారీ చేస్తుంటారని గుర్తించుకోవాలి. మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయించాలన్నది ప్రస్తుత విధానం.

ఇవి కూడా చదవండి

ఇమ్మిగ్రేషన్‌ డీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్‌ కార్డు జారీ చేస్తున్నారు. ఈఏడీ నిబంధనలను సడలించడంతో గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న వాళ్లకు మంచి రోజులు వచ్చినట్టే భావిస్తున్నారు. అమెరికాకు భారత్‌ నుంచి ప్రతి ఏటా లక్షలాదిమంది వెళ్తుంటారు. ఉన్నత విద్యతో పాటు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తారు భారతీయులు. అమెరికా ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో భారతీయులకు ఊరట లభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి