Aadhar-Ration Card Linking: రేషన్ కార్డ్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు తెలుసా..?

ఈ రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇతర సర్టిఫికేట్లతో పాటు రేషన్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడికార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇలా అన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలనే నిబంధనలు..

Aadhar-Ration Card Linking: రేషన్ కార్డ్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు తెలుసా..?
Aadhar - Ration Card Linking
Follow us

|

Updated on: Jun 16, 2023 | 6:36 PM

ఈ రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇతర సర్టిఫికేట్లతో పాటు రేషన్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడికార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇలా అన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలనే నిబంధనలు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డును కూడా ఆధార్‌తో అనుసంధానం చేయాలనే నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. వీటిని అనుసంధానించేందుకు గడువు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఈ గడువు జూన్‌ 30, 2023 వరకు మాత్రమే ఉండేది. ఈ గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేషన్‌కార్డులపై కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. ఒకటి కంటే ఎక్కువ రేషన్‌కార్డులు కలిగిన వారిపై నిఘా వేసి చర్యలు చేపడుతోంది. ఎక్కువ రేషన్‌కార్డులు ఉన్నవారి కార్డులను నిషేధించేందుకే ఈ ఆధార్‌ అనుసంధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉండటం ద్వారా రేషన్‌ సరుకులను సైతం అధికంగా తీసుకుంటున్నట్లు కేంద్ర అధికారులు గుర్తించారు. దీని వల్ల నిజమైన లబ్దిదారులకు సరైన రేషన్‌ అందక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఇలా ఆధార్‌ అనుసంధానం చేసినట్లయితే వారి బండారం బయటపడిపోతోంది. దీని వల్ల ఎక్కువ కార్డులున్నవారిపై చర్యలు చేపట్టి కార్డులను రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.

రేషన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ఎలా..?

టెక్నాలజీ పెరిగిపోయిన కారణంగా రేషన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం మరింత సులభతరం అయిపోయింది. లింక్‌ చేసుకోవాలంటే మీ రేషన్‌ కార్డుతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్‌ కాపీ, కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను రేషన్‌ కార్డు షాపులో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను సమర్పించేందుకు మీ వేలిముద్రలను అందించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌ పూర్తిగా జరిగిన తర్వాత మీ రేషన్‌కార్డ్‌ ఆధార్‌తో అనుసంధానం అవుతుంది.

ఆన్‌లైన్‌లో లింక్‌ చేసుకోవడం ఎలా?

మీరు ముందుగా పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ పోర్టల్‌లోకి వెళ్లాలి. ఆత ర్వాత ఆధార్‌, రేషన్‌ కార్డు నంబర్లను, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత కొనసాగింపుపై క్లిక్‌ చేయగా, మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ పనిని పూర్తి చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి