LPG Gas: మీ ఇంట్లో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఐతే జాగ్రత్త..
గ్రామాల్లో కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటి, పిడకలు వంటి వాటితో వంట చేసుకునేవారు. దీని వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతుందని, కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని.. అందుకే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను వినియోగించాలని చెబుతున్నారు.
Updated on: Jun 16, 2023 | 7:13 PM

గ్రామాల్లో కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటి, పిడకలు వంటి వాటితో వంట చేసుకునేవారు. దీని వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతుందని, కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని.. అందుకే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను వినియోగించాలని చెబుతున్నారు.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ద్వారా కూడా కాలుష్యం అధికంగానే వెలువడుతోందంటూ వాషింగ్టన్ యూనివర్సిటీ తాజా పరిశోధనల్లో బయటపడింది. నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు గ్యాస్ స్టౌల నుంచి వెలువడుతున్నట్లు తెల్పింది. అమెరికాలోని లారెన్స్ బర్కిలీ జాతీయ ప్రయోగశాల వర్గాలూ ఇదే విషయాన్ని నొక్కి చెప్పాయి.

వంటగ్యాస్‌లో ప్రధానంగా మీథేన్ వాయువు ఉంటుంది. సిలిండర్ల నుంచి లేదా బర్నర్ల నుంచి మీథేన్ వాయువు లీకైతే అగ్ని ప్రమాదం సంభవిస్తుందనే విషయం తెలిసిందే.

అలాగే గ్యాస్ మండించినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు వెలువడుతాయని, వాటి వల్ల శ్వాసకోశ, గుండె కవాటాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోదకులు చెబుతున్నారు. దీర్ఘకాలంపాటు నైట్రోజన్ డయాక్సైడ్ ప్రభావానికి గురైతే ఆస్థమా, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం వంటి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

ఇక స్టౌను ఆపేసి ఉంచినప్పుడు కూడా విషవాయువులు కొంతమేర విడుదల అవుతూనే ఉంటాయని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. రోడ్లపై వాహనాల ద్వారా వెలువడేదానికంటే వంటింట్లోని గ్యాస్ స్టౌ నుంచే అధికంగా నైట్రోజన్ డయాక్సైడ్ వస్తుంది. వంటగదిలో స్టౌ నుంచి వెలువడే ఈ వాయువు చాలాసేపు గదిలోనే ఉండిపోతుంది. అలాగే ఉపయోగించని గ్యాస్ స్టౌల నుంచి రంగు, వాసన లేని మీథేన్ వాయువు వెలువడుతుంది. వంటగ్యాస్‌లో క్యాన్సర్ కారకమైన బెంజీన్ సైతం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.





























