- Telugu News Photo Gallery Spiritual photos These Zodiac Signs Most Likely to have sudden luck money wise. Check details
Money Luck Astrology: నాలుగు స్థానాల్లో గ్రహ సంచార ప్రభావం.. వచ్చే నెల రోజులు వీరికి ఆకస్మిక ధనవృద్ధి పక్కా.. అందులో మీరున్నారా..?
ప్రస్తుతం గ్రహ సంచారం ప్రకారం ఏ ఏ రాశుల వారికి ఇప్పటి నుంచి వచ్చే నెల 15 వరకు ధనం వృద్ధి చెందుతుందో పరిశీలించవలసి ఉంది. ఈ నాలుగు స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్న పక్షంలో అత్యధికంగా డబ్బు సంపాదించడం జరుగుతుంది. ఒక స్థానంలో మాత్రమే గ్రహ సంచారం జరుగుతున్న పక్షంలో సాధారణ వృద్ధి మాత్రమే కనిపిస్తుంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jun 16, 2023 | 6:29 PM

జ్యోతిష శాస్త్రంలో 3, 6,10,11 స్థానాలను ఉపచయ స్థానాలు అంటారు. ఉపచయ స్థానాలంటే ధన వృద్ధి స్థానాలని అర్థం. ఈ స్థానాలలో శుభ గ్రహాలు ఉన్నా (జాతక చక్రంలో), సంచరిస్తున్నా సక్రమ మార్గాల ద్వారా, పాప గ్రహాలు ఉన్నా, సంచరిస్తున్నా అక్రమ మార్గాల ద్వారా ధనం వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం గ్రహ సంచారం ప్రకారం ఏ ఏ రాశుల వారికి ఇప్పటి నుంచి వచ్చే నెల 15 వరకు ధనం వృద్ధి చెందుతుందో పరిశీలించవలసి ఉంది. ఈ నాలుగు స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్న పక్షంలో అత్యధికంగా డబ్బు సంపాదించడం జరుగుతుంది. ఒక స్థానంలో మాత్రమే గ్రహ సంచారం జరుగుతున్న పక్షంలో సాధారణ వృద్ధి మాత్రమే కనిపిస్తుంది.

మేష రాశి: ఈ రాశి వారికి ఈ నెల 16 నుంచి వచ్చే నెల 16 వరకు మూడవ స్థానంలో రవి సంచారం జరుగుతుంది. ఇక 11వ స్థానంలో శని సంచారం జరుగుతోంది. అందువల్ల విశేషమైన ధనవృద్దికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి విషయంలో వీరు చేసే ఆలోచనలు, వీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రుల నుంచి డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఆదాయం పెరుగుతుంది. అక్రమ సంపాదన పెరగటానికి కూడా అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈ రాశి వారికి మూడవ స్థానంలో కుజ, శుక్ర గ్రహాలు, పదవ స్థానంలో శనీశ్వరుడు సంచరించడం వల్ల లాభాలకు ఆదాయానికి ఏ మాత్రం లోటు ఉందని పరిస్థితి ఏర్పడుతుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఆదాయం లేదా సంపాదన పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి రంగంలో ఉన్నవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఫలితంగా ఆర్జన అభివృద్ధి చెందుతుంది. అంతేకాక అదనపు ఆదాయ ప్రయత్నాలు, పై సంపాదన కలిసి వస్తాయి.

మిథున రాశి: ఈ రాశి వారికి 11వ స్థానంలో గురువు, రాహువుల సంచారం వల్ల సంపాదనలో అభివృద్ధి కనిపిస్తోంది. ఆర్థిక పరంగా ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది సత్ఫలితాలను ఇస్తుంది. సక్రమ మార్గాల ద్వారానే కాకుండా అక్రమ మార్గాల ద్వారా కూడా ధనవృద్దికి అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఆలోచనలు నిర్ణయాలను వెనువెంటనే ఆచరణలో పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా 11వ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల, ధనాన్ని నిల్వ చేసుకోవడం కూడా జరుగుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి పదవ స్థానంలో గురు రాహువులు పదకొండవ స్థానంలో బుధ గ్రహం సంచరిస్తు న్నందు వల్ల తప్పకుండా ధన వృద్ధికి అవకాశం ఉంది. గతంలో తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణ యాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 11వ స్థానంలో బుధ గ్రహ సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశి వారు ఒక పథకం ప్రకారం లేదా ఒక వ్యూహం ప్రకారం వ్యవహరించి ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారి సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది.

సింహ రాశి: సింహ రాశి వారికి దశమ స్థానంలో బుధ గ్రహం, 11వ స్థానంలో రవి గ్రహం సంచరిస్తూ ఉండటం వల్ల, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ వంటివి విజయం సాధించి, ఆశించిన దాని కంటే ఎక్కువగా ధనం ఇచ్చే అవకాశం ఉంది. ధన వృద్దికి పాటుపడడం ఎక్కువ అవుతుంది. కొత్త కొత్త ఆలోచనలు పథకాలతో ప్రయత్నాలను ముమ్మరం చేయటం జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టడం జరగదు. ఏది ఏమైనా ఈ నెల రోజుల కాలంలో విశేషంగా ధన వృద్ధికి అవకాశం ఉంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో శని, పదవ స్థానంలో రవి, 11వ స్థానంలో కుజ, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నందువల్ల సంపాదన పెరగడానికి లాభాలు పెరగటానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో డబ్బు కూడ పెట్టడానికి వీలుంది. సాధారణంగా ఉద్యోగ పరంగా లేదా వృత్తిపరంగా సంపాదన పెరిగే సూచనలు ఉన్నాయి. సక్రమ మార్గాలతో పాటు అక్రమ మార్గాలు కూడా తోడవుతాయి. ధన సంపాదన ప్రధాన ధ్యేయం అయిపోతుంది. ఇందుకు సంబంధించి ఎక్కువగా కృషి జరుగుతుంది. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారుతుంది.

తులా రాశి: ఈ రాశి వారికి పదవ స్థానంలో కుజ, శుక్ర గ్రహాల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ధన వృద్ధికి అవకాశం ఉంది. సక్రమ సంపాదన కన్నా అక్రమ సంపాదన ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచే కాకుండా పిల్లల నుంచి కూడా ఆదాయం అభివృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆర్థికంగా పురోగతి ప్రారంభం అవుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో గురు, రాహువులు సంచరిస్తూ ఉన్నందువల్ల సంపాదనకు ఏమాత్రం లోటు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా మారు తుంది. రెండు మూడు మార్గాలలో ఆదాయం సమకూర్చుకోవడం జరుగుతుంది. ఆరవ స్థానంలో పాప గ్రహమైన రాహు సంచారం కూడా జరుగుతున్నందువల్ల అక్రమ, చట్టవిరుద్ధ కార్య కలాపాల ద్వారా కూడా డబ్బు సంపాదనకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది.

ధనూ రాశి: ఈ రాశి వారికి మూడవ స్థానంలో శనీశ్వరుడు, ఆరవ స్థానంలో బుధ గ్రహ సంచారం వల్ల వీరి ఆలోచనలు, వ్యూహాలు ఫలించి డబ్బు సంపాదన పెరిగే అవకాశం ఉంది. చాలావరకు ఆకస్మికంగానూ, అప్రయత్నంగానూ ధనవృద్ది జరుగుతుందని చెప్పవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. వారసత్వం ద్వారా లేక కోర్టు కేసుల ద్వారా ఆస్తి సంక్రమించే అవకాశం కూడా ఉంది. తృతీయ స్థానంలో శని సంచారం వల్ల ఏదో విధంగా ధనం సంపాదించాలనే తపన పెరుగుతుంది.

మకర రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో ఈ నెల 16 నుంచి రవి సంచారం వల్ల ఆర్థిక స్థిరత్వం లభి స్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంత వరకు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో తప్పకుండా మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆదాయపరమైన పురోగతి కని పిస్తుంది. వారసత్వ సంపద చేతికి అందే సూచనలు కనిపిస్తున్నాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఈ రాశి వారికి కొద్దిగా డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి మూడవ స్థానంలో గురు, రాహువులు, ఆరవ స్థానంలో కుజ, శుక్ర గ్రహాల సంచారం వల్ల తప్పకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు తగ్గించు కోవడం, పొదుపు పాటించడం వల్ల ధన వృద్ధికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఈ స్థానాలలో శుభ, పాప గ్రహాల మిశ్రమం వల్ల అక్రమ మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదనకు అవకాశం ఉంటుంది. అదనపు సంపాదన మీద దృష్టి పడుతుంది.

మీన రాశి: మూడవ స్థానంలో బుధసంచారం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉండటం జరుగుతుంది. ఖర్చులు తగ్గించు కోవడం తప్పనిసరిగా పొదుపు పాటించడం వంటి చర్యల వల్ల ఆదాయ పరిస్థితి స్థిరంగా ఉండటం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. వడ్డీ వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారి ఆలోచనలు, నిర్ణయాలు ఫలించి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో సంపాదన పెరగటం జరుగుతుంది.





























