- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: woman Should not have these qualities, which will lead her towards destruction
Chanakya Niti: స్త్రీలలో ఉండకూడని 4 లక్షణాలు.. ఉంటే తనకే కాక, తాను వెళ్లిన కుటుంబానికి కూడా వినాశనమే..!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాలు నేటికీ మానవ జాతికి మార్గదర్శకంగా ఉన్నాయి. ఎన్నో శాస్త్రాల గురించి అవగాహన ఉన్న చాణక్యుడు స్త్రీ మూర్తిలో ఉండకూడని కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఎందుకంటే ‘స్త్రీతోనే సృష్టి.. స్త్రీతోనే వినాశనం’ అని పెద్దల మాట. ఈ క్రమంలో స్త్రీలో ఏయే లక్షణాలు ఉండకూడదని చాణక్యుడు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 17, 2023 | 7:00 AM

వివేకం, మార్గదర్శకత్వం: కష్టాలు ఎదురైనప్పుడు తెలివైన, అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి జ్ఞానం, మార్గదర్శకత్వం పొందడం చాలా ముఖ్యం. వారి జ్ఞానం,అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలు మీకు వచ్చిన ఇబ్బందులను అధిగమించడానికి ఉపయోగకరంగా ఉంటాయి. తెలివి తేటలు కలిగిన వ్యక్తుల వ్యూహాలు మీ సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయి.

అహంకారం: కొందరు స్త్రీలు ఎంతో వినయంగా ఉంటారు. అలాంటివారి కారణంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా సిరిసంపదలతో విలసిల్లుతాయి. కానీ కొందరిలో అహంకారం ఉంటుంది. అది వారికే కాక వారి బంధువులకు కూడా ప్రమాదం. స్త్రీలోని అహంకారం వినాశానికి దారితీస్తుంది. కాబట్టి స్త్రీలకు అహంకారం ఉండడం మంచిది కాదు.

ఫ్లెక్సిబిలిటీ: ఎప్పుడైనా సంక్షోభ సమయం ఏర్పడితే.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో సరళంగా ధృడంగా ఉండటం చాలా అవసరం. అంతేకాదు కొత్త ఆలోచనలను స్వీకరించి అవసరమైన విధంగా మీ వ్యూహాలను సర్దుబాటు చేకుంటూ జీవితంలో ముందుకు వెళ్తే అభివృద్ధి మీ సొంతం.

స్వీయ-అభివృద్ధిపై దృష్టి: ఒకొక్కసారి ఏర్పడిన చెడు సమయం కూడా మీ వ్యక్తిగత పెరుగుదల, అభివృద్ధికి అవకాశంగా ఉపయోగపడతాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి మంచి సహకారిగా అవుతాయి. మీ బలహీనతలను బలోపేతం చేసుకోవడానికి చెడు కాలాన్ని ఉపయోగించండి. నిరంతర స్వీయ-అభివృద్ధి భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది

కోపం: స్త్రీలకు కోపం ఉండడం తనకే కాక తాను వెళ్లిన కుటుంబానికి కూడా మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు.కోపంతో ఉన్న మహిళ ఇతరుల స్నేహాన్ని ఎన్నటికీ పొందలేదు. ఇంకా ఇతరులతో ఉన్న సత్సంబంధాలు నశించడమే కాక బంధువర్గాలలో లేనిపోని గొడవలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి స్త్రీలు కోపం లేకుండా శాంతమైన స్వభావాన్ని కలిగి ఉండడం మంచిది.





























