- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti for growth in life always keep these things secret In telugu
Chanakya Niti: పొరపాటున కూడా ఈ విషయాలు ఎవరితోనూ చెప్పవద్దు హానికరం అంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలని నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. మనిషి పొరపాటున కూడా తనకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకోకూడదని నొక్కి చెప్పాడు. ఇలా చేయడం వలన భవిష్యత్ లో సమస్యలను కలిగిస్తుంది. చాణక్యుడి చెప్పిన విధానాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
Updated on: Jun 16, 2023 | 1:07 PM

వ్యక్తిగత వ్యూహాలు: పొరపాటున కూడా ఇతరులకు, ముఖ్యంగా శత్రువులకు లేదా మీ పోటీదారులకు .. మీరు చేపట్టనున్న విషయంలో ప్రణాళికలు లేదా వ్యూహాలను బహిర్గతం చేయకూడదని ఆచార్య చాణక్యుడు సూచిస్తున్నాడు. సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం వలన అది భవిష్యత్ లో ద్రోహం చేయడానికి కారణంగా మారవచ్చు. లేదా మీ విజయావకాశాలను ఏ విధంగానైనా అడ్డంకిగా మారవచ్చు.

ప్రేమ, మానవ సంబంధాలు జీవితంలోని సంక్లిష్టమైన అంశాలు. అందరినీ మెప్పించే విధంగా జీవించలేరు.. అయితే బంధాలు నిలబడాలంటే కొన్ని త్యాగాలు సర్దుకుపోయే మానసతత్వం అవసరం.. ఇవి లేని వ్యక్తులను ప్రేమించినా, భాగస్వామిగా చేసుకున్నా ఎల్లప్పుడూ ఇబ్బందులు తప్పవని పేర్కొన్నాడు చాణక్యుడు. జీవితంలోఇతర దృక్కోణాలను కూడా పరిగణించడం అవసరని తెలిపాడు.

బలహీనతలు- రహస్యాలు: మీ బలహీనతలను లేదా వ్యక్తిగత రహస్యాలను ఇతరులకు వెల్లడించడం వలన మీరు చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అని చాణక్య చెప్పారు. మీరు చెప్పిన అలాంటి సమాచారాన్ని తమ స్వలాభం కోసం కొందరు కొన్ని సమయాల్లో ఉపయోగించుకుంటారని..అప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కనుక అలాంటి విషయాలను గోప్యంగా ఉంచడం తెలివైన పని అని చాణక్యుడు నమ్మాడు.

విశ్లేషణ, వ్యూహరచన: పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించి, సవాళ్లను అధిగమించడానికి వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని చాణక్యుడు సూచించాడు. సమస్యను చిన్నదిగా చేసే విధంగా పనులను విభజించుకుని.. వాటిని క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం వలన చెడు సమయాలు కూడా కలిసి వస్తాయి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం కొందరు స్వార్ధపూరితంగా ఉంటారని.. తమ సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తారని.. ఇటువంటి వ్యక్తులకు వీలైనంత దూరం ఉండాలని పేర్కొన్నాడు. ఇటువంటి వ్యక్తిత్వం ఆలోచనా తీరు ఉన్న వ్యక్తులు ప్రేమ, సంబంధాలకు బంధాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని తెలిపాడు. ఈ వ్యక్తులు సంబంధాలకు ఎక్కువ సమయం ఇవ్వఋ.. త్వరగా సంబంధాలు విచ్ఛిన్నమవుతాయని చాణక్య చెప్పాడు.





























