- Telugu News Photo Gallery Spiritual photos Story behind Om Banna Temple of Rajasthan where motorcycle Royal Enfield Bullet is worshiped in telugu
Bullet Baba Temple: బుల్లెట్‌కు భక్తులు పూజలు.. సినిమా స్టోరీని తలపించే స్టోరీ బుల్లెట్ బాబా ఆలయం సొంతం
అతిపురాతన దేశం భారతదేశం మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. దేశంలో విచిత్రమైన, రహస్యమైన దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఈ ఆలయాల రహస్యాలోని రహస్యాలు, అద్భుతాలు అపరిష్కృతంగా ఉండి నేటికీ సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. భారతదేశంలోని మిస్టీరియస్ దేవాలయాల్లో ఒకటి బుల్లెట్ బాబా టెంపుల్. ఇక్కడ రాయల్ ఎంఫీల్డ్ భక్తులతో పూజలను అందుకుంటుంది. దీని వెనుక అసలు కథ సినిమా కథను తలపిస్తుంది.
Updated on: Jun 16, 2023 | 12:13 PM

అవును బుల్లెట్ బాబా టెంపుల్ చరిత్ర కథ కాదు.. వాస్తవం. పోలీసులు కూడా తమ ఓటమిని అంగీకరించిన నిజం. 1988లో బుల్లెట్ బైక్ పై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొని చనిపోయాడు. ప్రమాద గురించి సమాచారం అదనుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

మర్నాడు ఉదయం పోలీస్ స్టేషన్ బయట ఉండాల్సిన బైక్ కనిపించలేదు. పోలీసులు అవాక్కయ్యారు. బైక్ కోసం వెతకగా.. ఎట్టకేలకు పోలీసులకు ఆ బైక్ ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. పోలీసులు మళ్లీ ఆ బైక్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే మర్నాడు కూడా మళ్లీ అదే ఘటన రిపీట్ అయింది.

ముందు పోలీసులు ఎవరో చేస్తున్న చిలిపి పనిగా భావించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి బైక్ నుంచి పెట్రోల్ ట్యాంక్‌ను ఖాళీ చేసి బైక్‌కు చైన్‌వేసి బంధించాడు. అయితే మరుసటి రోజు మళ్లీ బైక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంది. బైక్‌ను ఎత్తుకెళ్లిన వ్యక్తిని పట్టుకునేందుకు రాత్రిపూట నిఘా ఉంచారు.. అయినప్పటికీ ఈ వింత ఎపిసోడ్ కొన్ని రోజులు కొనసాగింది

చివరికి తమ ఓటమిని అంగీకరించి మృతుడి కుటుంబ సభ్యులకు బైక్‌ను తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత బులెట్ ను పూజించడానికి ఒక గుడిని నిర్మించారు. ఈ వింత ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

రాజస్థాన్‌లోని పాలి స్థానికుల కథనం ప్రకారం డిసెంబర్ 23, 1988న బుల్లెట్ బాబా ఆలయం ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఓం సింగ్ రాథోడ్ పేరు మీద నిర్మించారు. ఠాకూర్ జోగ్ సింగ్ రాథోడ్ కుమారుడు ఓం సింగ్ రాథోడ్ బుల్లెట్ బైక్‌పై తన అత్తమామల గ్రామమైన చోటిలాకు వెళ్తున్నాడు.

ఆ సమయంలో అతని బైక్ చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఓం అక్కడిక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత అతని బుల్లెట్ పోలీస్ స్టేషన్ నుంచి రోజూ సంఘటన స్థలానికి చేరుకుంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన పోలీసులు ఆ బుల్లెట్‌ను కుటుంబ సభ్యులకు తిరిగి అప్పగించారు.

ఆ తర్వాత గుడి కట్టి అందులో బుల్లెట్ బైక్‌ను ఉంచాడు. ఈ దేవాలయం ఓం బన్నా ధామ్ గా పేరుగాంచింది. ప్రజలు దీనిని బుల్లెట్ బాబా మందిర్ అని కూడా పిలుస్తారు. గ్రామంలోని మహిళలు కూడా ఓం బన్నా ఆశీస్సులు తీసుకుంటారు. తమ భర్తలు బైక్ డ్రైవింగ్ చేసే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తారు.




