- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Neeti: The Life Lessons To Be Learnt From A Dog, which will lead you towards success
Chanakya Neeti: కుక్కల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు.. ఇవే మీకు సంతోషం, విజయం కలిగిలే చేస్తాయంటున్న చాణక్య..
Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు రాజకీయ, పాలన, ఆర్థిక వంటి పలు అంశాలలో మహా మేధావి. అంతేకాదు, జీవితం గురించి కూడా అపార జ్ఞానం కలిగిన మహోన్నతమైన వ్యక్తి. అందుకే ఆయన చెప్పిన నీతి సూత్రాలను నేటికీ మనం తెలిసీ తెలియకుండానే పాటిస్తుంటాం. అయితే ఆచార్యుడు మనిషి తన జీవితంలో సంతోషం, విజయం పొందాలంటే పెంపుడు కుక్క నుంచి కొన్ని జీవిత పాఠాలను నేర్చుకోవాలని సూచించాడు. వాటిని నేర్చుకుని పాటిస్తే విజయం తప్పక వరిస్తుందని చెప్పాడు. మరి కుక్క నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jun 21, 2023 | 3:54 PM

Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు రాజకీయ, పాలన, ఆర్థిక వంటి పలు అంశాలలో మహా మేధావి. అంతేకాదు, జీవితం గురించి కూడా అపార జ్ఞానం కలిగిన మహోన్నతమైన వ్యక్తి. అందుకే ఆయన చెప్పిన నీతి సూత్రాలను నేటికీ మనం తెలిసీ తెలియకుండానే పాటిస్తుంటాం. అయితే ఆచార్యుడు మనిషి తన జీవితంలో సంతోషం, విజయం పొందాలంటే పెంపుడు కుక్క నుంచి కొన్ని లక్షణాలను నేర్చుకోవాలని సూచించాడు. వాటిని నేర్చుకుని పాటిస్తే విజయం తప్పక వరిస్తుందని చెప్పాడు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం కొందరు స్వార్ధపూరితంగా ఉంటారని.. తమ సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తారని.. ఇటువంటి వ్యక్తులకు వీలైనంత దూరం ఉండాలని పేర్కొన్నాడు. ఇటువంటి వ్యక్తిత్వం ఆలోచనా తీరు ఉన్న వ్యక్తులు ప్రేమ, సంబంధాలకు బంధాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని తెలిపాడు. ఈ వ్యక్తులు సంబంధాలకు ఎక్కువ సమయం ఇవ్వఋ.. త్వరగా సంబంధాలు విచ్ఛిన్నమవుతాయని చాణక్య చెప్పాడు.

యజమాని భక్తుడు: ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు కుక్క మాత్రమే అని అందరికీ తెలిసిందే. తనను పోషించినవారి పట్ల ఎప్పుడు కూడా అది కృతజ్ఞతాభావంతో మెలుగుతుంది. అలాంటి లక్షణం కలిగిన వ్యక్తి కష్టాలను భరించగలడు. ఎందుకంటే తన యజమానిపై తన విశ్వాసం అతన్ని ఆ పరిస్థితుల్లో కాపాడుతుందని చాణక్యుడు పేర్కొన్నాడు.

విశ్లేషణ, వ్యూహరచన: పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించి, సవాళ్లను అధిగమించడానికి వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని చాణక్యుడు సూచించాడు. సమస్యను చిన్నదిగా చేసే విధంగా పనులను విభజించుకుని.. వాటిని క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం వలన చెడు సమయాలు కూడా కలిసి వస్తాయి.

ధైర్యం: కుక్క ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటుంది. కుక్కలు ప్రదర్శించే ఆ ధైర్యం మనిషికి జీవితంలో అన్నివేళలా ఉపయోగపడుతుందని చాణక్యుడు చెప్పాడు.





























