- Telugu News Photo Gallery Spiritual photos All your problems will be get rid of if you Visit these Hanuman temples across India
Hanuman Temples: ఆంజనేయుడి ఈ ఆలయాలను సందర్శిస్తే అన్ని దుఃఖాలు దూరం.. లిస్టులో తెలంగాణలోని దేవాలయం కూడా..
Hanuman temples: శ్రీరామబంటు అయిన అంజనేయుడు ఆభయాంజనేయుడిగా కూడా ప్రసిద్ధి. ఎందుకంటే భూతప్రేతాల నుంచి, కష్టాల చుట్టుముట్టినప్పుడు మనల్ని రక్షించగలడని పెద్దలు చెబుతుంటారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న హనుమంతుడి ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్నింటికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయా ఆలయాలను సందర్శిస్తే మన కష్టాలు, అన్ని రకాల దుఃఖాలు దూరమవుతాయని పెద్దల నమ్మకం. మరి ఆ దేవాలయాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jun 16, 2023 | 7:00 AM

జఖు దేవాలయం, సిమ్లా: ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ హనుమాన్ దేవాలయానికి భారతదేశం నుంచే కాక విదేశీ భక్తులకు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. జఖు పర్వతం పైన ఉన్న కారణంగా దీన్ని జఖు దేవాలయం అంటారు. లక్ష్మణుని కోసం సంజీవనిని తీసుకురావడానికి వెళుతున్నప్పుడు, యక్ష ఋషి తపస్సు చేస్తున్న ఈ ప్రదేశంలో హనుమంతుడు ఆగాడని చెబుతుంటారు.

సలాసర్ హనుమాన్ దేవాలయం, రాజస్థాన్: అంజనేయుడి ఈ ప్రసిద్ధ ఆలయాన్ని సలాసర్ బాలాజీ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ఈ ఆలయంలో ఉన్న హనుమంతుడి విగ్రహం గడ్డం, మీసాలతో ఉంటుంది. ఈ కారణంగా కూడా రాజస్థాన్‌లోని ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. హిందూ శాస్త్రాల ప్రకారం, ఈ బాలాజీ ఆలయానికి నిజమైన విశ్వాసం, స్పష్టమైన మనస్సుతో వచ్చిన భక్తులందరూ విజయాన్ని పొందుతారు.

బడే హనుమాన్ జీ, ప్రయాగ్‌రాజ్: 20 అడుగుల హనుమంతుడి విగ్రహం కలిగిన ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఉంది. హనుమంతుడి ఈ విగ్రహ దర్శనం కోసం రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

హనుమాన్‌గఢీ, అయోధ్య: రామనగరి అయోధ్యలో ప్రస్తుతం రామ మందిరం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే రామభక్త హనుమంతుడి హనుమాన్‌గఢీ అనే ప్రసిద్ధ ఆలయం ఉంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ ఆలయాన్ని శ్రీరాముడు లంకకు తిరిగి వచ్చిన తర్వాత తన అత్యంత ప్రియమైన స్నేహితుడు హనుమాన్ జీకి అంకితమిస్తూ నిర్మించాడు. రావణుడిపై రాముడు గెలిచిన తర్వాత లంక నుంచి తెచ్చిన కొన్ని గుర్తులు ఇప్పటికీ ఈ ఆలయంలో ఉన్నాయి. ఇక ఈ దేవాలయాన్ని సందర్శిస్తే.. రాముడికి తోడు ఉన్నట్లుగానే హనుమంతుడు కూడా మీకు అండగా నిలుచుంటాడని ప్రతీతి.

ఖమ్మం హనుమాన్ ఆలయం, తెలంగాణ: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సతీసమేతంగా ఉన్న హనుమంతుడి ఆలయం ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. హనుమంతుడు తన భార్య సువర్చలతో సహా ఉన్న చాలా కొద్ది ఆలయాల్లో ఇది కూడా ఒకటి. చాలా మంది హనుమంతుడు బ్రహ్మచారి అనుకుంటారు కానీ పురాణాల ప్రకారం సూర్యభగవానుడి కుమార్తె అయిన సువర్చలాదేవిని హనుమంతుడు వివాహమాడాడు.





























