- Telugu News Photo Gallery Cricket photos From MS Dhoni to AB De Villier these top 10 wicketkeepers picked wickets in international cricket
Top 10 Wicketkeeper: వీళ్ల రూటే సపరేటు.. బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన కీపర్లు.. టాప్ 10 లిస్టులో ముగ్గురు మనోళ్లే..
Top 10 Wicketkeeper: ప్రస్తుతం వికెట్ కీపర్లు బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌కే పరిమితమయ్యారు. అయితే వీరిలో కొందరు వికెట్ కీపర్లు కీపింగ్, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా రాణించారని మీకు తెలుసా?
Updated on: Jun 16, 2023 | 8:31 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లు, ఆల్ రౌండర్లు మినహా పార్ట్ టైమ్ బౌలర్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ వంటి బ్యాటర్లు కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్లే. కానీ వీరికి బౌలింగ్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది.

ఇక వికెట్ కీపర్ల విషయానికి వస్తే ఈ రోజుల్లో వికెట్ కీపర్లు కేవలం బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌కే పరిమితమవుతున్నారు. అయితే ఈ వికెట్ కీపర్లలో కొందరు కీపింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా రాణించారని మీకు తెలుసా? అలాంటి టాప్ 10 వికెట్ కీపర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ టెస్టుల్లో 1 వికెట్, వన్డేల్లో 4 వికెట్లు పడగొట్టాడు.

ఆఫ్రికా జట్టు బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ కీపింగ్‌తో పాటు బౌలింగ్ చేసి టెస్టుల్లో 2 వికెట్లు, వన్డేల్లో 7 వికెట్లు పడగొట్టాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వన్డేల్లో 1 వికెట్ తీసిన తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత ఆటగాడు సయ్యద్ కిర్మాణి టెస్టుల్లో 1 వికెట్ పడగొట్టాడు.

లంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ టెస్టు క్రికెట్‌లో బౌలింగ్ చేసి 1 వికెట్ తీశాడు.

న్యూజిలాండ్ తుఫాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ కూడా టెస్టులో 1 వికెట్ తీసుకున్నాడు.

దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ టెస్టుల్లో 1 వికెట్ పడగొట్టాడు.

మరో లంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ కీపింగ్‌తో కలిసి వన్డేల్లో 106, టెస్టుల్లో 39, టీ20ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.

జింబాబ్వేకు చెందిన బ్రెండన్ టేలర్ టీ20లో 1 వన్డేలో 9 వికెట్లు పడగొట్టాడు.

జింబాబ్వేకు చెందిన టాటెండర్ టైబు టెస్టుల్లో 1 వికెట్, వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు.





























