Hero Xtreme 160R: పల్సర్, అపాచీలకు పోటీగా మార్కెట్‌లోకి దూసుకొస్తున్న హీరో ఎక్స్‌ట్రీమ్.. ధరెంతో తెలుసా?

ముఖ్యంగా 160 సీసీ ఇంజిన్ వేరియంట్ బైక్స్‌లో ఇప్పటికే బజాజ్ పల్సర్ ఎన్ 160, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వీ సేల్స్ పరంగా దుమ్మురేపుతున్నాయి. అయితే ఈ రెండు పెట్రో బైక్స్‌కు పోటీగా ఎప్పటి నుంచో హీరో ఎక్స్‌ట్రీమ్ రిలీజ్ అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారి అంచనాలకు తగినట్లే హీరో ఎక్స్‌ట్రీమ్ లేటెస్ట్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది.

Hero Xtreme 160R: పల్సర్, అపాచీలకు పోటీగా మార్కెట్‌లోకి దూసుకొస్తున్న హీరో ఎక్స్‌ట్రీమ్.. ధరెంతో తెలుసా?
Hero Xtreme
Follow us
Srinu

|

Updated on: Jun 16, 2023 | 4:30 PM

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. ఫోర్ వీలర్స్‌తో పోల్చుకుంటే టూ వీలర్స్ అమ్మకాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో టూవీలర్స్‌కు సంబంధించిన స్కూటర్ మార్కెట్‌లో ఈవీ వాహనాలకు తమదైన మార్క్ చూపిస్తున్నా సూపర్ స్పీడ్ వాహనాల విషయం దగ్గరకు వచ్చేసరికి పెట్రో వాహనాలనే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా 160 సీసీ ఇంజిన్ వేరియంట్ బైక్స్‌లో ఇప్పటికే బజాజ్ పల్సర్ ఎన్ 160, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వీ సేల్స్ పరంగా దుమ్మురేపుతున్నాయి. అయితే ఈ రెండు పెట్రో బైక్స్‌కు పోటీగా ఎప్పటి నుంచో హీరో ఎక్స్‌ట్రీమ్ రిలీజ్ అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారి అంచనాలకు తగినట్లే హీరో ఎక్స్‌ట్రీమ్ లేటెస్ట్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ మూడు వేరియంట్లల్లో అందుబాటులో ఉంది. ఈ బైక్ ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ బైక్ స్టాండర్డ్, కనెక్టడ్, ప్రో వేరియంట్లల్లో అందుబాటులో ఉంది. ఈ బైక్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.1,27,300 (ఎక్స్ షోరూమ్)గా ఉంటే ప్రో వెర్షన్ ధర రూ.1,36,500గా ఉంది. మిడ్ లెవెల్ బైక్ ప్రియులను ఆకట్టుకునేలా రిలీజ్ చేసిన కనెక్టెడ్ వెర్షన్ ధర రూ.1,32,800గా ఉంది. ఈ బైక్ కచ్చితంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బైక్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ బైక్ డెలివరీ జూలై రెండో వారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ రివైజ్డ్ ఇంజిన్‌తో వస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఈ బైక్ నాలుగు వాల్వ్ హెడ్‌లతో వస్తుంది. అయితే అవుట్ గోయింగ్ కోసం రెండు వాల్వ్‌లను ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ బైక్‌కు 4 వీ అనే పేరును నిర్ణయించారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ అప్‌డేట్ ఆయిల్డ్ కూల్ ఇంజిన్ పనితీరును పెంచడంతో పాటు టాప్ ఎండ్‌ను మెరుగుపర్చడంలో సాయం చేస్తుంది.

ఈ సరికొత్త మోడల్ 163 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే 8500 ఆర్‌పీఎం వద్ద 16.6 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బైక్ ఐదు గేర్‌లతో సూపర్ స్పీడ్ ఫంక్షనింగ్‌కు మద్దతునిస్తుంది. అలాగే ఈ బైక్ సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో వస్తుంది. అలాగే యూఎస్‌డీ ఫోర్కులు మరింత ఫీడ్ బ్యాక్‌ను అందించడంతో సాయం చేస్తాయి. ప్రీలోడ్ అడ్జెస్టబులిటీతో వెనుక వైపు షాక్ అబ్జార్బర్లతో ఈ స్కూటర్ ఆకర్షణీయంగా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి