Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Pulsar NS160 vs Hero Xtreme : పల్సర్.. ఎక్స్‌ట్రీమ్ మధ్యే పోటీ.. లుక్స్ సేమ్.. కానీ ఫీచర్లే డిఫరెంట్..

పల్సర్ ఎన్ఎస్ 160 బైక్‌కు హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ ప్రధాన పోటీగా ఉంది. ముఖ్యంగా ఈ రెండు చూడడానికి ఒకే రకంగా ఉన్నా.. ఫీచర్లుపరంగా రెండింటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఈ రెండు మోటర్ సైకిల్స్ స్ట్రీట్ ఫైటర్స్‌గా ఉంటున్నాయి.

Bajaj Pulsar NS160 vs Hero Xtreme : పల్సర్.. ఎక్స్‌ట్రీమ్ మధ్యే పోటీ.. లుక్స్ సేమ్.. కానీ ఫీచర్లే డిఫరెంట్..
Pulsa Vs Xtreme
Follow us
Srinu

|

Updated on: Mar 30, 2023 | 5:00 PM

బజాజ్ ఆటో ఇటీవల పల్సర్ ఎన్ఎస్ లైనప్‌ను అప్‌డేట్ చేసింది. ముఖ్యంగా పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 బైక్స్ అప్‌డేట్ చేశారు. ముఖ్యంగా భారత్‌లో అమ్మకాలు పెంచుకునే బజాజ్ తన బైక్స్‌ను అప్‌డేట్ చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అప్‌డేట్ చేసిన పల్సర్ ఎన్ఎస్ 160 బైక్‌కు హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ ప్రధాన పోటీగా ఉంది. ముఖ్యంగా ఈ రెండు చూడడానికి ఒకే రకంగా ఉన్నా.. ఫీచర్లుపరంగా రెండింటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఈ రెండు మోటర్ సైకిల్స్ స్ట్రీట్ ఫైటర్స్‌గా ఉంటున్నాయి. అయితే పల్సర్ ఎన్ఎక్స్ 160 మరింత దూకుడు లుక్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా పాత పల్సర్ లుక్ వచ్చేలా ఈ బైక్‌ను డిజైన్ చేయడంతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పల్సర్ లవర్స్‌ను అయితే ఈ బైక్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. కేవలం చూడడానికి ఒకేలా ఉన్నా.. పరీక్షించి చూస్తే మాత్రం రెండు బైక్స్ మధ్య తేడాలను గమనించవచ్చు. కాబట్టి మార్కెట్‌లో పోటీ పడుతన్న ఈ రెండు బైక్స్ గురించి మిగిలిన విషయాలపై ఓ లుక్కేద్దాం.

ప్రధాన తేడాలివే..

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ కంటే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 శక్తివంతమైంది. ఈ బైక్ 16.96 బీహెచ్‌పీ, 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ ఆర్ 15 బీహెచ్‌పీ, 14 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పల్సర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుండగా హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్  ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఈ రెండు మోటర్ సైకిల్స్‌లో గేర్ బాక్స్ 5 స్పీడ్ యూనిట్స్‌తో ఉంటాయి. పల్సర్ ఎన్ఎస్ 160లో ఫ్రంట్ సస్పెన్షన్ అప్‌గ్రేడ్ చేశారు. ముందు భాగంలో 33 ఎంఎం అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనో షాక్‌తో వస్తుంది. 300 ఎంఎం ముందు వైపు, 230 ఎంఎంతో డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అయితే హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ డైమండ్ ఫ్రేమ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు వైపు 37 ఎంఎం టెలీస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్‌తో వస్తుంది. ముందు భాగంలో 270 ఎంఎం పెటల్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు 220 ఎంఎం పెటల్ డిస్క్ లేదా 130 ఎంఎం డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 

ఫీచర్లు, ధర

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్‌లో ఎల్ఈడీ లైటింగ్, యూఎస్‌బీ చార్జర్, బ్రైట్ నెస్ కంట్రోల్, డిజిటన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హీరో కనెక్ట్ ఫీచర్లతో వస్తుంది. అయితే పల్సర్ ఎన్ఎస్ 160లో ఇంకా హాలోజన్ లైటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నారు. డిస్టేన్స్ టూ ఎంప్టీ రీడౌట్, ఇన్‌స్టంటేనియస్ ఫ్యూయల్ ఎకనామి, గేర్ పొజిషన్ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామి వంటీ ఫీచర్లు అప్ డేట్ చేశారు. అయితే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 ధర రూ.1.35 లక్షలుగా ఉంటే, హీరో ఎక్స్‌ట్రీమ్ ధర రూ.1.18 లక్షలుగా ఉంది. కాబట్టి మీ బడ్జెట్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని మీకు తగిన బైక్ కొనుగోలు చేయడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి