Second Hand Bikes: సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనాలనుకుంటున్నారా..? అతి తక్కువ ధరల్లో ఈ మూడు ద్విచక్ర వాహనాలు

Second Hand Bikes: సెకండ్ హ్యాండ్ మోటార్‌సైకిళ్లు ఆఫ్‌లైన్ నుండి ఆన్‌లైన్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొత్త బైక్‌ తీసునేందుకు స్థోమతలేని వారు..

Second Hand Bikes: సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనాలనుకుంటున్నారా..? అతి తక్కువ ధరల్లో ఈ మూడు ద్విచక్ర వాహనాలు
Second Hand Bike
Follow us
Subhash Goud

|

Updated on: Sep 04, 2022 | 9:55 PM

Second Hand Bikes: సెకండ్ హ్యాండ్ మోటార్‌సైకిళ్లు ఆఫ్‌లైన్ నుండి ఆన్‌లైన్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొత్త బైక్‌ తీసునేందుకు స్థోమతలేని వారు ఈ సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలపై ఆసక్తి చూపుతుంటారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో జాబితా చేయబడిన అలాంటి కొన్ని మోటార్‌సైకిళ్ల గురించి వివరాలు అందించబోతున్నాము. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసే ముందు, దాని కండీషన్, దాని డాక్యుమెంట్లు మొదలైనవాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి.

బజాజ్ పల్సర్: సెకండ్ హ్యాండ్ సెగ్మెంట్‌లో బైక్‌ను కొనుగోలు చేస్తూ, బైక్‌దేఖో అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ ధర రూ.25500. ఈ మోటార్‌సైకిల్‌లో 178.6 cc ఇంజన్ ఉంది. ఇది 17 PS పవర్, 14.22 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్‌ 2012మోడల్‌. ఈ బైక్‌ ఇప్పటివరకు 43500 కి.మీ తిరిగింది. ఇందులో డబుల్ డిస్క్, ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు. అలాగే ఇది సింగిల్ ఛానల్ ABS తో వస్తుంది.

Hero Motocorp Ignitor బైక్ దేఖో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్ 2012 మోడల్. ఈ మోటార్‌సైకిల్ 124.7 cc ఇంజన్‌తో వస్తుంది. దీని వల్ల ఇది 10.9 PS పవర్, 11 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ ఇప్పటివరకు 50 వేల కిలోమీటర్లు ప్రయాణించింది.

ఇవి కూడా చదవండి

TVS స్పోర్ట్ కిక్ స్టార్ట్ స్పోక్ బైక్ దేఖో అనే వెబ్‌సైట్ల నుండి 20 వేల రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 2015 సంవత్సరపు మోడల్ కాగా, ఇప్పటివరకు 28 వేల కిలోమీటర్లు నడిచింది. ఇది 99.7 cc ఇంజిన్‌. ఇది 7.4 PS శక్తిని పొందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి