Indian Exonomy: ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే అవకాశం..SBI రీసెర్చ్ విభాగం అంచనా.. ఎప్పటికంటే..
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి.. బ్రిటన్ ను వెనక్కి నెట్టిన భారత్.. భవిష్యత్తులు తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతో క్షిణించి.. ఒక్కసారిగా వృద్ధిరేట్లు
Indian Economy: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి.. బ్రిటన్ ను వెనక్కి నెట్టిన భారత్.. భవిష్యత్తులు తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతో క్షిణించి.. ఒక్కసారిగా వృద్ధిరేట్లు పడిపోయాయి. లాక్ డౌన్ కారణంగా భారత్ లో కూడా వివిధ రంగాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. అయినప్పటికి.. కోవిడ్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు కేంద్రప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలోపడుతోంది. ముఖ్యంగా ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా కోవిడ్ కారణంగా క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తోంది. దీంతో భారత్ 2029 నాటికి మూడోస్థానానికి చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ జీడీపీ వాటా 2014లో 2.6% ఉండగా, ఇప్పుడు అది 3.5 శాతానికి చేరిందని తెలిపింది. 2027 నాటికి 4 శాతానికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం జర్మనీ నాలుగో స్థానంలో ఉంది. 2014 నుంచి భారత్ అనుసరిస్తున్న తీరును చూస్తే 2029 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని తెలిపింది. 2014లో 10వ స్థానంలో ఉన్న భారత్ 15 ఏళ్లలో ఏడు స్థానాలను ఎగబాకినట్లవుతుంది. ప్రస్తుత వృద్ధిరేటు ప్రకారం చూస్తే 2027 నాటికి జర్మనీని, 2029 నాటికి జపాన్‌ను భారత్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. రాబోయే రోజుల్లో చైనాలో కొత్త పెట్టుబడులు మందగించే అవకాశం ఉన్నందున ఆ మేరకు భారత్ లబ్ధిపొందే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది.
భారతదేశం ఆర్థిక రంగంలో వేగంగా పురోగమిస్తోందని, 2028-2030కి తన అంచనా ప్రకారం, 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ విర్మాణి చెప్పారు. అరవింద్ విర్మాణి మాట్లాడుతూ.. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ధోరణి ముఖ్యమైనదని, అది మన విదేశాంగ విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డీజీ సచిన్ చతుర్వేది మాట్లాడుతూ.. భారత్ బ్రిటన్‌ను అధిగమించడం ఇదే తొలిసారి కాదని… 2019లో కూడా భారత్ బ్రిటన్ ను వెనక్కి నెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్ మూలధన వ్యయంపై దృష్టి పెట్టిందని, ఆదాయ వ్యయాన్ని తగ్గించడం ద్వారా.. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుసరిస్తున్న వ్యూహం దేశ ఆర్థిక వ్యవస్థను సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్థికరంగం నిపుణులు చరణ్ సింగ్ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించడం దేశానికి గర్వకారణమైన క్షణమని, ఆర్థిక రంగంలో మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నామని తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం దాదాపు అదుపులో ఉందని.. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఐఎంఎఫ్ చాలా కాలంగా చెబుతోంది. అదే సమయంలో, UK ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది మరియు పనితీరు బాగా లేదు. మన వృద్ధికి సంబంధించి, ఇది స్థిరమైన వృద్ధి అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఆర్థిక మందగమనం ముప్పు పొంచి ఉండగా, భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది.
Delhi| Last year we were 6th by about 40 billion & it was expected to happen in 2022. India is moving up the power scale & by value of forecast we will become 3rd largest by 2028-30: Dr Arvind Virmani, former chief economic advisor on India becoming world’s fifth largest economy pic.twitter.com/irwHHqU2SN
— ANI (@ANI) September 3, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..