Neha Singh Rathore: ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు.. సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరో తెలుసా!
బీహార్‌కు చెందిన జానపద గాయని, సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై లక్నోలో దేశద్రోహం కింద కేసు నమోదైంది. జమ్మూకాశ్మీర్ పెహల్గామ్‌లోని బైసారన్‌లోయలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఆమో ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు.

నేహా సింగ్ రాథోడ్.. ఈమె ఒక జానపద గాయని, పొలిటికల్ సెటైరిస్ట్. అయితే ఈమెపై తాజాగా లక్నోలో దేశంద్రోహం కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లోని బైసారన్‌లోయలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈమె వివాదాస్పద పోస్ట్‌లు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమె చేసిన పోస్టులు ఒక మతాన్ని టార్గెట్ చేసేలా ఉన్నాయని.. ఆమె వ్యాఖ్యలు మత ఘర్షణలు ప్రోత్రహించేలా ఉన్నాయని అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఆమెపై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదును పరిణనలోకి తీసుకున్న పోలీసులు ఆమె పోస్టులను పరిశీలించిన తర్వాత నేహా సింగ్‌పై భారతీయ న్యాయ సంహిత కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
అసలు ఈ నెహా సింగ్ రాథోడ్ ఎవరూ
1997లో జన్మించిన నెహా సింగ్ రాథోడ్ బీహార్‌లో తన బాల్యాన్ని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కాన్పూర్ వర్సిటీలో బీఎస్పీ పూర్తి చేసి 2018లో డిగ్రీ పట్టా పొందింది. సింగర్ కావాలనే ఆసక్తితో జానపద పాటలు నేర్చుకొని.. బోజ్‌పురి పాటలు పాడడం స్టార్ట్ చేసింది. ఓ యూట్యూబ్ చానెల్ పెట్టి ఆమె పాడిన పాటలను ఫోన్‌లో రికార్డ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది ఇలా తన ఫాలోవర్స్‌ను పెంచుకుంది. స్థానిక పొలిటికల్ అంశాలపై వీడియోలు చేస్తూ ఆమె పొలిటికల్ సెటైరిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
पहलगाम हमले के जवाब में अब तक सरकार ने क्या किया है? मेरे ऊपर FIR ?
अरे दम है तो जाइये…आतंकवादियों के सिर लेकर आइये!
सरकार मेरे ऊपर FIR करवाकर असली मुद्दों से ध्यान भटकाना चाहती है…क्या ये बात समझना इतना मुश्किल है? pic.twitter.com/mOuKPzYYoF
— Neha Singh Rathore (@nehafolksinger) April 28, 2025
మరిన్ని జాతీయ వర్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




