AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: పహాల్గామ్‌ ఉగ్రదాడిపై సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్..

ఒకరు యద్ధం చేయాలంటారు, ఇంకొకరు శాంతి మంత్రం జపిస్తారు. మరొకరు.. అసలు సింధూ నీళ్లు ఆపడమే దండగన్నట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల తలోమాట విని రాహుల్‌కు చిర్రెత్తుకొచ్చింది. నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ రాహుల్‌ గాంధీ ఏం అన్నారు?.. ఏం చెప్పారు.. ఈ వివరాలను తెలుసుకోండి..

Rahul Gandhi: పహాల్గామ్‌ ఉగ్రదాడిపై సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Apr 29, 2025 | 7:43 AM

Share

కాంగ్రెస్ అంటేనే.. తగువులు, కొట్లాటలు, ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటుంటారు. అటువంటిది క్లిష్ట సమయంలో పార్టీ నేతల మాటలు.. అగ్గికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. ఒకరు యుద్ధం చేయాలంటే, మరొకరు శాంతి అంటున్నారు. ఇంకొకరు సింధూ జలాలు ఆపడం తప్పంటూ మాట్లాడుతున్నారు. నేతల తలోమాట చూసి.. రాహుల్‌ గాంధీకి చిర్రెత్తుకొచ్చింది. పహాల్గామ్‌ దాడిపై పార్టీ లైన్‌ దాటొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంలో సొంత వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలిచ్చారు. తాను, ఖర్గే చెప్పిందే ఫైనల్‌ అని.. ఉగ్రదాడిపై ఎవ్వరూ సొంత అభిప్రాయాలు చెప్పొద్దని సూచించారు.

అంతకుముందు కర్నాటక సీఎం సిద్దరామయ్య, శశిథరూర్‌, కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సౌజ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పాకిస్తాన్‌తో యుద్దాన్ని తాను వ్యతిరేకిస్తునట్టు చెప్పారు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. శాంతిని కోరుకుంటునట్టు తెలిపారు. అంతేకాదు ఉగ్రదాడిలో నిఘా వ్యవస్థల వైఫల్యం ఉందన్నారు సిద్దరామయ్య..

సర్జికల్స్ స్ట్రైక్స్, వైమానిక దాడికి మించింది ఇప్పుడు చేయాలన్నారు కాంగ్రెస్ సీనియర్‌ నేత శశిథరూర్‌. దేశమంతా సైనిక దాడికి కోసం ఎదురు చూస్తుందని చెప్పారు.

కశ్మీర్‌కు చెందిన కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సౌజ్.. సింధు నీళ్లను ఆపడం దండగ అన్నారు. సర్ ప్లస్‌ వాటర్‌ను ఆపి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. యుద్ధం కాలంలోనూ ఆగని ఒప్పందం.. ఇప్పుడు ఆపడం కరెక్ట్ కాదన్నారు సైఫుద్దీన్ సౌజ్.

కాంగ్రెస్ నేతల మాటలతో అటు పార్టీని డ్యామేజ్ చేయడంతో పాటు.. ఇటు ప్రభుత్వానికి ఒక అస్త్రం ఇచ్చేలా ఉన్నాయి. దీంతో.. కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. హద్దు దాటి మాట్లాడే నాయకులు.. ఇకనైనా సెట్‌రైట్‌ అవుతారో లేదో చూడాలి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్