డిసెంబర్ నాటికి బంగారం ధర ఎలా ఉంటుందో తెలుసా..? 

Jyothi Gadda

25 April 2025

పసిడి పరుగులకు పగ్గాలు లేకుండా పోతోంది. రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పుత్తడి ధర రూ.లక్షకు అటు, ఇటు ఊగిసలాడుతోంది. ఇది ఇలాగే ఉంటే..

ఈ ఏడాది చివరి నాటికల్లా బంగారం ధర రూ.1.20 లక్షల నుంచి 1.25 లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు బులియన్ మార్కెట్‌ విశ్లేషకులు.

డిసెంబర్‌ నాటికి 24 క్యారెట్‌ 10 గ్రా. గోల్డ్‌ రూ.1.25 లక్షలకు చేరుతుందని అమెరికా ప్రముఖ బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌, ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్‌ సాచ్స్‌ ఓ అంచనా వేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డిసెంబర్‌ నాటికి ఔన్స్‌ 4,500 డాలర్లు పలుకవచ్చని గోల్డ్‌మన్‌ సాచ్స్‌ నివేదిక. ఇదే గనుక జరిగితే దేశీయంగా తులం రూ.1.25 లక్షలకు చేరడం ఖాయమంటున్నారు

వాణిజ్య యుద్ధం ముదిరితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. గోల్డ్‌మన్‌ సాచ్స్‌ కూడా ఇప్పుడిదే చెప్తున్నది. 

ట్రంప్‌ ప్రతీకార సుంకాలకు తెరతీయడంతో భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు అంతకంతకూ పతనమైపోయాయి. దీంతో మదుపరులు పసిడి వైపునకు కదులుతున్నారు. 

కానీ చైనాతో అమెరికా సుంకాల పోరు కొనసాగుతుండటం.. ఇన్వెస్టర్లలో ఆందోళనల్ని తగ్గించలేకపోతున్నది. దీంతో గోల్డ్‌మన్‌ సాచ్స్‌ తమ అంచనాలను ఇప్పటికే మూడుసార్లు సవరించింది.

2025లో గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనాలను మూడుసార్లు సవరించింది. తొలుత ఔన్స్‌ 3,300 డాలర్లుగా అంచనా వేయగా ఆపై 3,700 డాలర్లు, ఇప్పుడు 4,500 డాలర్లు అంటూ అంచనా వేసింది.