వైజాగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? 9 అద్భుతమైన ప్రదేశాలు
Jyothi Gadda
20 April 2025
Rushikonda Beach: ఒక పక్క కొండ. కొండ అంచునే ఉండే సముద్రం. వంపు తిరిగిన బీచ్. ఎత్తైన కొండలు.. అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటలకులు, ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
Kailasagiri Hill Park:దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం పేరుగాంచింది. కైలాసగిరి ప్రకృతి అందాలు ఎంతటి వారినైనా ముగ్ధులను చేస్తాయి.
Indira Gandhi Zoo: ఈ జూ పార్క్ 625 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనికి మూడు వైపులా తూర్పు కనుములు, మరొకవైపు బంగాళాఖాతం చూడముచ్చటగా ఉంటుంది. వేసవిలో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
Submarine Museum: భారత్ కు రాబోతున్న ముప్పు తప్పించిన సబ్ మెరైన్ కురుసురు కు రిటైర్మెంట్ ఇచ్చేశాకా.. దానిని విశాఖ బీచ్ వద్ద నిలిపారు. దీనిని ఇప్పుడు సబ్ మెరైన్ మ్యూజియంగా మార్చారు.
Borra Caves: ఈ గుహలు దాదాపు పది లక్షల సంవత్సరాల పురాతనమైనవి. ఈ గుహలు చూడడం ప్రత్యేక అనుభూతి, ఆశ్చర్యం కలిగిస్తాయి. ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తున్న ఫీలింగ్ వస్తుంది.
Victory at Sea Memorial: 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత సైనికులు చేసిన త్యాగాలను స్మరించుకోవడానికి దీనిని నిర్మించారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన నావికుల జ్ఞాపకార్థం దీనిని అంకితం చేశారు .
Bheemili Beach : తేలికపాటి గాలులకు ఊగుతున్న తాటి చెట్లు, ఊరికి వస్తున్న అలలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ బీచ్‌లో కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు.
Simhachalam Temple: తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపం చందనంతో కప్పబడి దర్శనమిస్తారు. ఏడాదికోసారి 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనం.
Yarada Beach: ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. పచ్చని కొండల మధ్య రణగోణ ధ్వనులకు దూరంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి సంధ్యా సమయాన్ని ఆస్వాదించండి.