విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఈ చిలగడదుంపల్లో విటమిన్ B-6, మెగ్నీషియం, విటమిన్ సీతోపాటు, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు , కేలరీలతో నిండి ఉంటుంది.
చిలగడదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులోని పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది.
చిలగడదుంపలు మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. చిలకడదుంపలు డైటరీ ఫైబర్ ను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేగు కదలికలను మృదువుగా చేసి మలబద్ధకాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది.
బరువు తగ్గడానికి సహయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో క్రమంగా పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెస్ట్ ఫుడ్‌గా కూడా స్వీట్ పోటాలో తీసుకోవచ్చు.
ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది. అలాగే ఈ దుంపలలోని అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్‌ను క్రమబద్ధీకరిస్తుంది.
తక్కువ మోతాదులో షుగర్ ఉన్నవారికి మంచిదని చెబుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది. రక్తపోటును నియంత్రిస్తుంది.
చిలకడదుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిలగడదుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను తగ్గిస్తాయి.