దేవునికి ఇష్టమైన ఈ పండు.. సర్వ రోగాలకు దివ్యౌషధం!

Jyothi Gadda

18 April 2025

విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలన్నీ మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం.

వెలగపండు జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.

జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. విరేచనాలు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి వెలగపండు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

వెలగపండులో విటమిన్ సి ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వెలగపండు సహకరిస్తుంది.

వెలగపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది. 

ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కూడా తోడ్పడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరిగేలా చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వెలగపండు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది. డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవచ్చు. 

ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి, కాలేయ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి మంచిది.

వెలగపండు రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి.