ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..!
కాలజ్ఞానం.. అంటే భవిష్యద్దర్శనం. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. పురాణ పురుషుల సంగతి పక్కనపెడితే.. ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారిలో చాలా మందికి తెలిసిన పేరు బాబా వంగా, నోస్ట్రోడామస్. అయితే తెలుగువారు నమ్మేది మాత్రం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.
ఇంతకీ ఈయన ఎవరు..? ఏం చెప్పారు..? బ్రహ్మంగారు చెప్పినట్లు మనం ప్రళయానికి దగ్గరలో ఉన్నామా..? కాలజ్ఞానం అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఈయనకు వీరం బొట్లయ్య అనే పేరు కూడా ఉంది. తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు, తల్లి ప్రకృతాంబ. బ్రహ్మంగారు ఎప్పుడు పుట్టారన్న దానికి సరైన ఆధారాలు లేవు. అయితే క్రీస్తు శకం 1518లో జన్మించారని కొందరంటే.. క్రీస్తు శకం 1608లో పుట్టారని మరికొందరు అంటారు. 8 ఏళ్లు వచ్చేసరికి వీర బ్రహ్మేంద్రస్వామికి అపారమైన జ్ఞానం వచ్చింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవారు. తండ్రి మరణం తర్వాత జ్ఞానసముపార్జన కోసం వివిధ ప్రదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ తల్లి అభ్యంతరం చెప్పడంతో ఆమెను ఒప్పించి దేశ సంచారం మొదలుపెట్టారు. అలా పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేసి అలసిపోయిన బ్రహ్మంగారు.. రాత్రికి అచ్చమ్మ అనే మహిళ ఇంటి ముందు అరుగుపై నిద్రపోయారు. ఉదయం ఆయనను చూసిన అచ్చమ్మ ఎవరు అని అడగగా.. బతుకుదెరువు కోసం వచ్చానని చెప్పడంతో ఆమె గోవుల కాపరి పని ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ??
హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని
ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త రంగు ‘ఓలో’ కనిపించిందోచ్
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

