కశ్మీర్‌లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో
మైదానంతో మినీ స్విట్జర్లాండ్‌ను తలపించే పహల్గాం సమీపంలోని బైసరన్‌లో ముష్కరులు నెత్తుటి క్రీడా ఆడారు. పర్యాటకులను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. టూరిస్టుల కేరింతలతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. పచ్చటి మైదానం ఎర్రబడింది. తూటా గాయాలతో ఒకరిద్దరు కాదు 26 మంది నేలకొరిగారు. 17 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ప్రకటించింది.
అసలు ఈ టిఆర్ఎఫ్ ఏంటి? దాని వెనుక ఎవరున్నారు? పహల్గాం లోని బైసరన్ లో కాల్పులకు తెగబడి పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కొత్తగా ఏర్పాటు అయింది. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది. 2019 లో తొలిసారి టిఆర్ఎఫ్ వెలుగులోకి వచ్చింది. తొలుత ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలకు కొనసాగించిన ఈ గ్రూప్ టెర్రరిస్టులు ఆ తర్వాత లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులతో కలిసి గ్రూపుగా ఏర్పాటు అయింది. టిఆర్ఎఫ్ పుట్టుక వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ పాకిస్తాన్ లష్కరే తోయిబా నుంచి ప్రపంచ దృష్టిని మరల్ించేందుకు పాక్ చెందిన ISI టిఆర్ఎఫ్ ను ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబాను కారణంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 2018లో పాకిస్తాన్‌ను నిషేధిత దేశాల లిస్టులో చేర్చింది. దీంతో ప్రపంచ దృష్టి మళ్ళించేందుకు పాక్ టిఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించిందని తెలుస్తోంది.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
