AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 6,6,4,6,4.. ఎవర్రా సామీ.. 9వ తరగతి స్టూడెంట్ దెబ్బకు 36 ఏళ్ల భారత బౌలర్ 15 ఏళ్ల కెరీర్ క్లోజ్

Vaibhav Suryavanshi: 38 బంతుల్లో 11 సిక్సర్లు, 7 ఫోర్లతో సహా 101 పరుగులు చేసిన వైభవ్.. ప్రతీ గుజరాత్ బౌలర్‌ను బాదేశాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఆరంభం ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తన తొలి ఐపీఎల్ సెంచరీతో మైదానంలో సందడి చేసిన వైభవ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Video: 6,6,4,6,4.. ఎవర్రా సామీ.. 9వ తరగతి స్టూడెంట్ దెబ్బకు 36 ఏళ్ల భారత బౌలర్ 15 ఏళ్ల కెరీర్ క్లోజ్
Vaibhav Suryavanshi, Ishant
Venkata Chari
|

Updated on: Apr 29, 2025 | 11:31 AM

Share

Vaibhav Suryavanshi: ఈ సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధికంగా ట్రోల్ అయిన వారిలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. అతను రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో కూర్చుని నిరంతరం ఏదో విషయంపై చర్చల్లోకి వస్తుంటాడు. రాజస్థాన్ రాయల్స్ డగౌట్ వైపు కెమెరా చూసినప్పుడల్లా, ద్రవిడ్ ఏదో చేస్తూనే ఉంటుంటాడు. తాజాగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసిన సమయంలో వీల్‌చైర్‌లో కూర్చున్న ద్రవిడ్‌ కూడా సంతోషం ఆపుకోలేక నిల్చుని చప్పట్లతో సంబురాలు చేసుకున్నాడు.

పవర్ హిట్టింగ్‌కు అవసరమైన పరిపక్వత, అద్భుతమైన ఆత్మవిశ్వాసం, సహజసిద్ధమైన ప్రతిభ అన్నీ కలిసిన ఒక లెజెండరీ ఇన్నింగ్స్‌తో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ స్టేడియాన్ని ఊపేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరివంతైంది.

ఇవి కూడా చదవండి

గుజరాత్ బౌలర్లపై దూకుడు..

38 బంతుల్లో 11 సిక్సర్లు, 7 ఫోర్లతో సహా 101 పరుగులు చేసిన వైభవ్.. ప్రతీ గుజరాత్ బౌలర్‌ను బాదేశాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఆరంభం ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తన తొలి ఐపీఎల్ సెంచరీతో మైదానంలో సందడి చేసిన వైభవ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ ఇప్పుడు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు కూడా వైభవ్ పేరిట చేరింది.

వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను మరింత గొప్పగా చేసే విషయం ఒకటి ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చాలా కాలంగా నంబర్ వన్ టీ20 బౌలర్‌గా నిలిచి ఇప్పటికీ టాప్ 10లో కొనసాగుతున్న రషీద్ ఖాన్, ఈ ఐపీఎల్‌లో 100 టెస్ట్ మ్యాచ్‌లతో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడిగా మారిన ఇషాంత్ శర్మ, ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న, అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, భారత జట్టు బౌలింగ్‌లో అగ్రగామిలలో ఒకరైన మహమ్మద్ సిరాజ్, అంతర్జాతీయ క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగా పేరుగాంచిన వాషింగ్టన్ సుందర్, ఈ సీజన్‌లో ‘స్పిన్ వండర్’ సాయి కిషోర్, ఆఫ్ఘన్ బలంతో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన కరీం జనత్.. ఇలా దిగ్గజ బౌలర్లతోపాటు అరంగేట్రం చేసిన బౌలర్‌ను ఉతికారేశాడు.

ఇషాంత్ శర్మ ఒకే ఓవర్లో 28 పరుగులు..

2010 సంవత్సరంలో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోని స్టార్ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. ఆ సమయానికి వైభవ్ సూర్యవంశీ పుట్టలేదు. కానీ, 2025లో ఈ 14 ఏళ్ల బౌలర్ 36 ఏళ్ల ఇషాంత్ శర్మ ఓవర్‌లో 500 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 28 పరుగులు చేశాడు. వైభవ్ ఇషాంత్ శర్మకు సీనియర్‌గా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. అతనిపై బౌండరీల వర్షం కురిపించాడు.

ఇషాంత్ ఓవర్‌లో బీభత్సం వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కరీం జనత్ ఓవర్‌లో 30 పరుగులు..

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కరీం జనత్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. అయితే, వైభవ్ అరంగేట్రం చేసిన జనత్‌ను కూడా వదల్లేదు. ఈ ఓవర్లో ప్రతి బంతికి బౌండరీలు బాది వైభవ్ మొత్తం 30 పరుగులు పిండుకున్నాడు. ఈ విధంగా, కరీం జనత్ తన ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నప్పుడు తన మొదటి ఓవర్లోనే అత్యధిక పరుగులు ఇచ్చిన మొదటి బౌలర్ అయ్యాడు. కరీం జనత్ టీ20 క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..