Video: అయ్యయ్యో..! చెన్నై ఓడిపోయింది.. ఈ చిన్నది కన్నీళ్లుపెట్టుకుంది.. స్టార్ హీరోయిన్ ను ఏడిపించారు కదరా..!!
Chennai Super Kings vs Sunrisers Hyderabad: చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఓడించి సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. చెన్నైని కేవలం 154 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ చిన్న లక్ష్యాన్ని హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే సాధించింది.

CSK vs SRH: ఐపీఎల్ (IPL) 2025 లో భాగంగా జరిగిన 43వ మ్యాచ్ లో 5 సార్లు ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడ్డాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ చూసేందుకు చాలామంది సినీతారలు వచ్చారు. చెన్నై జట్టుకు, మహేంద్ర సింగ్ ధోనీకి మద్దతు ఇచ్చేందుకు వీరంతా స్టేడియానికి చేరుకున్నారు. అయితే, ఈ మ్యాచ్ వారికి ఏమాత్రం ఆనందాన్ని అందిచలేదు. ఎందుకంటే హైదరాబాద్ చేతిలో చెన్నై ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో తమకు ఇష్టమైన జట్టు ఓడిపోవడం చూసి, కొంతమంది చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఏకంగా స్టేడియంలోనే ఏడవడం ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో ధోని కూడా తన మ్యాజిక్‌ను చూపించలేకపోయాడు. దీంతో అభిమానులతోపాటు సనీతారలు కూడా తమ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఈ లిస్ట్‌లో ఓ ఫేమస్ హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఎవరో ఫొటో చూసి గుర్తుపట్టలేకపోయారా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
CSK ఓటమితో కన్నీరు పెట్టిన పవన్ హీరోయిన్..
చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కమలహాసన్ కూతురు శ్రుతి హాసన్ హాజరైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె చాలా భావోద్వేగానికి లోనవుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపిస్తుంది. తనకు ఇష్టమైన జట్టు ఓడిపోవడం చూసి, ఆమె గుండె పగిలిపోయి, నిరుత్సాహపడింది. దీంతో తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన శృతిహాసన్ కన్నీళ్లు పెట్టింది. ఈమెతోపాటు ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కూడా తన కుటుంబంతో కలిసి మ్యాచ్ చూడటానికి స్టేడియానికి చేరుకున్నారు.
Shruti Haasan breaks down after CSK loss ⁉️ 🥹🥹🥹😭😭#CSKvsSRH #ShrutiHaasanpic.twitter.com/vli1Dj1Ze1
— Pan India Review (@PanIndiaReview) April 25, 2025
చెన్నై ఘోర పరాజయం..
CSK lost, SRH won… 😏
But Shruti Haasan stole the whole show — 🤤💦#CSKvsSRH #ShrutiHaasan 💛📷 pic.twitter.com/7XLYGXQm5d
— Silly Cricketer 🏏 (@SillyCricketers) April 26, 2025
చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఓడించి సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. చెన్నైని కేవలం 154 పరుగులకే ఆలౌట్ చేసింది. చెన్నై తరపున యువ బ్యాట్స్‌మన్ ఆయుష్ మాత్రే 30 పరుగులు సాధించగా, అరంగేట్ర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ 44 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్ ధోని బ్యాటింగ్‌లో విఫలమై 10 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ చిన్న లక్ష్యాన్ని హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే సాధించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








