బాబు బంగారం.! 10వ నెంబర్‌లో వచ్చి ప్రత్యర్ధులను పాతరేశాడు.. ఏకంగా 240 పరుగులతో..
క్రికెట్‌లో ఓ మ్యాచ్ నిలబడాలంటే.. కచ్చితంగా కీలకమైన భాగస్వామ్యాలు ఉండాల్సిందే. అయితే ఎప్పుడైనా కూడా పార్ట్‌నర్‌షిప్స్ ఓపెనింగ్ లేదా మిడిలార్డర్‌లో వస్తుంది. కానీ ఇక్కడ లోయర్ ఆర్డర్‌లో.. అదీ కూడా 10వ నెంబర్ బ్యాటర్ చరిత్ర సృష్టించారు. అతడెవరో తెల్సా మరి..

ఫార్మాట్ ఏదైనా.. గేమ్‌లో ఓ జట్టు నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా కీలక బ్యాటర్ల మధ్య భారీ భాగస్వామ్యాలు ఉండాల్సిందే. ఓపెనింగ్ లేదా మిడిలార్డర్‌లో ఈ పార్టనర్‌షిప్‌లు నెలకొల్పడం సర్వసాధారణం. కానీ ఇక్కడొక ఆసక్తికర విషయమేమిటంటే.. లోయర్ ఆర్డర్‌లో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఓ ప్లేయర్. అది కూడా 10వ వికెట్‌కు భారీ భాగస్వామ్యం వచ్చింది. అది కూడా 50 లేదా 100 కాదు.. ఏకంగా 300 పరుగుల రికార్డు. దీంతో ఏకంగా ఆ జట్టు కేవలం 5 గంటల్లోనే టెస్టు విజయాన్ని అందుకుంది. మరి ఆ ప్లేయర్ ఎవరో కాదు ఆస్ట్రేలియన్ ఆటగాడు అలాన్ కిప్పాక్స్.
ఈ మ్యాచ్ న్యూసౌత్ వేల్స్, క్వీన్స్‌లాండ్ మధ్య సిడ్నీ వేదికగా 1927–28లో జరిగింది. న్యూసౌత్ వేల్స్ తరపున ఆడిన కిపాక్స్ 10వ వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనే రికార్డు బ్రేకింగ్ పార్ట్‌నర్‌షిప్. ఆ మ్యాచ్‌లో కిపాక్స్.. హాల్ హుకర్‌తో కలిసి ఐదు గంటల్లో 307 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంలో కిపాక్స్ 240 పరుగులు జోడించగా.. మొత్తంగా 260 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అటు హాల్ హుకర్ 62 పరుగులు చేశాడు.
మరోవైపు 25 మే 1897న సిడ్నీలో జన్మించిన కిపాక్స్.. ఆస్ట్రేలియా తరపున 22 టెస్టుల్లో ఆడాడు. ఇక 61 షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లు ఆడిన కిపాక్స్ 70కి పైగా సగటుతో 6096 పరుగులు చేశాడు. తన కెరీర్ మొత్తంలో 175 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కిపాక్స్ 57.22 సగటుతో 12,762 పరుగులు చేశాడు. వీటిలో 43 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కిపాక్స్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 315 నాటౌట్. కాగా, 1972లో కిపాక్స్ సిడ్నీలో 75 సంవత్సరాల వయసులో మరణించాడు.





