AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: వాళ్ళు చేయగా లేంది మేము చేయలేమా? ఆ స్టార్ ప్లేయర్ తో పోల్చుకుంటున్న వైజాగ్ బుల్లోడు!

ఐపీఎల్ 2025లో SRH తమ ప్లేఆఫ్స్ ఆశలను నిలబెట్టుకుంటూ CSK పై విజయాన్ని సాధించింది. నితీష్ కుమార్ రెడ్డి, కమిండు మధ్య భాగస్వామ్యం విజయంలో కీలకంగా నిలిచింది. “RCB గతంలో చేసిందంటే మేము చేయలేమా?” అనే నితీష్ వ్యాఖ్య SRH అభిమానుల్లో ఆశను రేకెత్తించింది. యువ ఆటగాళ్లు చక్కటి ప్రదర్శనతో జట్టుకు కొత్త ఊపు తీసుకువచ్చారు.

IPL 2025: వాళ్ళు చేయగా లేంది మేము చేయలేమా? ఆ స్టార్ ప్లేయర్ తో పోల్చుకుంటున్న వైజాగ్ బుల్లోడు!
Rcb Vs Srh
Narsimha
|

Updated on: Apr 26, 2025 | 9:35 AM

Share

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్ రేసులో కొనసాగడానికి పూర్వవైభవాన్ని తిరిగి పొందాలని సంకల్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చివరికి తమ ఆటతీరు ద్వారా ఆశలు రగిలించగలిగింది. నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో SRH, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి తమ ప్లేఆఫ్స్ అవకాశాలను బ్రతికించుకుంది. ఈ విజయంతో SRH రెండు వరుస ఓటముల అనంతరం తిరిగి గెలుపు బాట పట్టగా, CSK వరుసగా రెండవ పరాజయాన్ని మూటగట్టుకుంది. టార్గెట్‌గా 15 పరుగులు లక్ష్యంగా ఉంచిన SRH, 18.4 ఓవర్లలో 155/5 స్కోరు చేసి విజయం సాధించింది. కమిండు (32*), నితీష్ కుమార్ రెడ్డి (19*) మధ్య భాగస్వామ్యం విజయానికి బలమైన మూలంగా నిలిచింది. ముఖ్యంగా, మెండిస్ మ్యాచ్ విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించగా, నితీష్ కీలక మద్దతుగా నిలిచాడు.

విజయానందంతో మీడియాతో మాట్లాడిన నితీష్ కుమార్ రెడ్డి తన భావోద్వేగాలను వ్యక్తపరిచాడు. ప్రస్తుత పాయింట్ల పట్టికలో SRH తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. అదే సమయంలో, CSK నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇది CSKకి చెపాక్‌లో వరుసగా నాల్గవ ఓటమి అయ్యింది. గతంలో 2008, 2012 సీజన్లలో కూడా CSK ఒకే సీజన్‌లో చెపాక్‌లో నాలుగు ఓటములు చవిచూశారు. ఈ నేపథ్యంలో, CSK రాబోయే మ్యాచ్‌లో PBKSను ఢీకొనుండగా, SRH అహ్మదాబాద్‌లో GTతో తలపడనుంది. ఈ విజయంతో SRH మళ్ళీ ప్లేఆఫ్ ఆశలను బలపరిచినట్టు అయింది. “గత సంవత్సరం, ఆర్‌సిబి, విరాట్ కోహ్లీ అద్భుతంగా తిరిగి వచ్చారు. ఈసారి మనం ఎందుకు చేయకూడదు?” అంటూ నితీష్ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ద్వారా జట్టులో ఉన్న నమ్మకాన్ని సూచించాడు. SRH అభిమానులలో ఈ మాటలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

SRH జట్టు ఈ విజయంతో మళ్లీ ఊపు మీదకి వచ్చిందని చెప్పొచ్చు. జట్టులోని యంగ్ టాలెంట్ నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, వంటి వారు తమ సత్తా చాటుతున్నారు. సీనియర్ మహమ్మద్ షమీ, హర్షల్ పటేళ్లూ మెరుగైన ప్రదర్శన ఇవ్వడం జట్టుకు నూతన జోష్ తీసుకొచ్చింది. కోచ్ డేనియల్ వెటోరి మార్గదర్శనంలో SRH ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. గేమ్‌లపై ఫోకస్ పెడుతూ, మ్యాచ్ తర్వాత మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా తీసుకుంటూ ఉంటే, ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యమేమీ కాదు. ఒకసారి మోమెంటం పట్టుకుంటే RCB లాగే తిరుగులేని జట్టుగా మారే అవకాశం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..