Video: తొలి బంతికి సరికొత్త చరిత్ర.. కట్‌చేస్తే.. రెండో బంతికి ఘోర తప్పిదం.. ఐపీఎల్‌లో అరుదైన సీన్
SRH Bowler Mohammed Shami: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తొలి బంతికే చారిత్రాత్మక ఘనత సాధించాడు. కానీ, అతను రెండవ బంతికి భారీ తప్పిదం చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అరుదైన సీన్ చోటు చేసుకుంది.

SRH Bowler Mohammed Shami: ఐపీఎల్ 2025 43వ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన తొలి బంతికే చరిత్ర సృష్టించాడు. కానీ, మ్యాచ్ రెండవ బంతికి ఘోర తప్పిదం చేశాడు. ఇది క్రికెట్ మైదానంలో చాలా అరుదుగా జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో బంతికి అతను నో బాల్ వేశాడు. కానీ, ఈ నో బాల్ లైన్ పై గానీ, హైట్ పై గానీ లేదు. దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
తొలి బంతికే చరిత్ర సృష్టించిన షమీ..
ఈ మ్యాచ్‌ను మహమ్మద్ షమీ చాలా అద్భుతంగా ప్రారంభించాడు. మ్యాచ్ తొలి బంతికే చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ షేక్ రషీద్ వికెట్ తీసుకున్నాడు. ఐపీఎల్‌లో నాలుగోసారి మ్యాచ్‌లోని మొదటి బంతికే షమీ వికెట్ తీసుకున్నాడు. ఈ ఘనతను నాలుగుసార్లు సాధించిన ఏకైక బౌలర్ అతనే. అంతేకాకుండా, ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే వికెట్ తీసిన తొలి బౌలర్‌గా కూడా అతను నాల్గవసారి ఈ రికార్డులో చేరాడు.
ఐపీఎల్ మ్యాచ్‌లో మొదటి బంతికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
4 సార్లు – మహమ్మద్ షమీ
2 సార్లు – డిర్క్ నాన్నెస్
2 సార్లు – లసిత్ మలింగ
2 సార్లు – ఉమేష్ యాదవ్
2 సార్లు – భువనేశ్వర్ కుమార్
2 సార్లు – ట్రెంట్ బౌల్ట్
రెండో బంతికి ఘోర తప్పిదం..
Aate hi kaam shuru kar diye! 🔥#MohammadShami strikes on the very first ball of the innings to give #SRH the perfect start in their quest for a maiden win at Chepauk! 💥
Can they make history tonight?👇✍🏻
Watch the LIVE action ➡ https://t.co/uCvJbWdEiC#IPLonJioStar 👉… pic.twitter.com/lLI5Ox5zXv
— Star Sports (@StarSportsIndia) April 25, 2025
మ్యాచ్‌లోని మొదటి బంతికే మహ్మద్ షమీ చారిత్రాత్మక ఘనత సాధించాడు. కానీ, రెండవ బంతికే నో బాల్ వేశాడు. నిజానికి, అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో తన చేతితో వికెట్‌ను తాకాడు. ఈ సంఘటన రన్ అప్ సమయంలో జరిగింది. దీని కారణంగా అంపైర్ ఈ బంతిని నో బాల్‌గా ప్రకటించారు. క్రికెట్‌లో బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తన చేతితో వికెట్‌ను తాకడం చాలా అరుదుగా జరుగుతోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..