KKR vs PBKS: పరువు కోసం రహానే.. ప్లే ఆఫ్‌లో చోటు కోసం శ్రేయాస్.. ప్రతీకార పోరులో గెలుపు ఎవరిదో?
KKR vs PBKS Probable Playing XI: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మొదటి సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమయ్యాయి. ఇప్పటివరకు చాలాసార్లు తలపడ్డాయి. ఇరుజట్ల మధ్య జరిగిన 34 మ్యాచ్‌ల్లో కోల్‌కతా జట్టు 21 సార్లు విజయాన్ని అందుకుంది. పంజాబ్ 13 సార్లు గెలిచింది. అయితే, గత 3 మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే, పంజాబ్ కింగ్స్ గెలిచింది.

KKR vs PBKS Preview and Prediction: ఐపీఎల్ (IPL) 2025లో, కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 26, శనివారం జరగనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా సొంత మైదానం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుత సీజన్‌లో రెండు జట్లు తలో 8 మ్యాచ్‌లు ఆడాయి. కానీ, ప్రదర్శన పరంగా చూస్తే, ఇరుజట్లు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. కోల్‌కతా కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి, 5 ఓటములను ఎదుర్కొంది. మరోవైపు, పంజాబ్ 5 మ్యాచ్‌ల్లో గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఐదవ స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడో స్థానంలో ఉన్నాయి.
కోల్‌కతా వర్సెస్ పంజాబ్ (KKR vs PBKS) రెండూ తమ చివరి మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కోల్‌కతా గుజరాత్ చేతిలో 39 పరుగుల తేడాతో ఓడిపోగా, పంజాబ్‌ను బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్లు విజయ మార్గంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ సీజన్‌లో వీరిద్దరి మధ్య ఇదిరెండో మ్యాచ్ అవుతుంది. అంతకుముందు, ఈ సీజన్‌లోని 31వ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. పంజాబ్ 16 పరుగుల తేడాతో కోల్‌కాతాను ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో కోల్‌కతా తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది.
IPLలో KKR vs PBKS మధ్య గణాంకాలు..
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మొదటి సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమయ్యాయి. ఇప్పటివరకు చాలాసార్లు తలపడ్డాయి. ఇరుజట్ల మధ్య జరిగిన 34 మ్యాచ్‌ల్లో కోల్‌కతా జట్టు 21 సార్లు విజయాన్ని అందుకుంది. పంజాబ్ 13 సార్లు గెలిచింది. అయితే, గత 3 మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే, పంజాబ్ కింగ్స్ గెలిచింది.
KKR vs PBKS మ్యాచ్‌లో ఆధిక్యం ఎవరిదంటే?
కోల్‌కతా వర్సెస్ పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టును అంచనా వేస్తే, పంజాబ్‌ను బలమైన పోటీదారుగా పిలవొచ్చు. దీనికి ప్రధాన కారణం కోల్‌కతా బ్యాటింగ్‌లో సమన్వయ ప్రదర్శన లేకపోవడం, బౌలింగ్ కూడా సాధారణంగానే ఉండడం. మరోవైపు, పంజాబ్‌లో చాలా మంది ఇన్-ఫామ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కూడా బాగా రాణిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించిందని చెప్పవచ్చు.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కీపర్), నేహల్ వాధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్/వైశాక్ విజయ్‌కుమార్.
కోల్‌కతా నైట్ రైడర్స్: రహమానుల్లా గుర్బాజ్ (కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మోయిన్ అలీ/రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








