8 ఫోర్లు, 6 సిక్సర్లు.. 2 ఓవర్లలో 94 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే వైల్డ్ ఫైర్ ఓవర్.. బౌలర్లకు రక్త కన్నీరే భయ్యో
Cricket Highest Score One Over 77 Runs: ఐపీఎల్ 2025లో సగం మ్యాచ్‌లు పూర్తయి ప్లేఆఫ్స్ రేసు ఉధృతంగా సాగుతోంది. అత్యధిక, అత్యల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. అయితే, క్రికెట్ ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యేలా చేసే రికార్డ్ ఒకటి ఉందని. ఓ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 77 పరుగులు, 2 ఓవర్లలో 94 పరుగులు నమోదై క్రికెట్ చరిత్రలో బద్దలవ్వని రికార్డుగా మిగిలిపోయిందని మీకు తెలుసా?

Lee German Record Runs: ఐపీఎల్ 2025లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో ప్లే ఆఫ్స్ రేసు తారాస్థాయికి చేరుకుంది. ఈ లీగ్‌లో కొన్నిసార్లు అత్యల్ప స్కోర్లు నమోదవుతుండగా, మరికొన్ని సార్లు ఫోర్లు, సిక్సర్లతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ చేధనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 18వ సీజన్‌లో ఎన్నో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఓకే ఓవర్‌లో అత్యధిక పరుగులు కూడా నమోదవుతున్నాయి. అయితే, ఓ బ్యాట్స్‌మెన్ కేవలం 2 ఓవర్లలోనే 94 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడని మీకు తెలుసా? అది ఎప్పుడు, ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకే ఓవర్‌లో రికార్డ్ పరుగులు..
ఒక ఓవర్‌లో 36 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించవచ్చని అందరికీ తెలిసిందే. కానీ, ఒకే ఓవర్‌లో 36 పరుగులకు రెట్టింపు కంటే ఎక్కువ వచ్చాయని మీకు తెలుసా? అవును, ఓ ఓవర్‌లో 77 పరుగులు వచ్చాయి. ఇందులో 8 ఫోర్లు, 6 సిక్సర్లు వచ్చాయి. ఇది ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో నమోదవ్వడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లలోనే 94 పరుగులు నమోదయ్యాయి. ఇది క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
ఒకే ఓవర్‌లో 77 పరుగులు..
ఈ మ్యాచ్ గురించి తెలియాలంటే, 1990 సంవత్సరంలోకి వెళ్లాల్సిందే. క్రైస్ట్‌చర్చ్‌లోని కాంటర్‌బరీ వర్సెస్ వెల్లింగ్టన్ మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్ జరిగింది. ఈ షెల్ ట్రోఫీ మ్యాచ్‌లో ఒక అద్భుతం జరిగింది. చివరి రోజున, కాంటర్బరీ గెలవడానికి 2 ఓవర్లలో 95 పరుగులు అవసరం. అంతా ఈ మ్యాచ్ గురించి ఆశ వదులుకున్నారు. కానీ, ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. వెల్లింగ్టన్ బౌలర్ బెర్ట్ వాన్స్ ఒక ఓవర్లో 22 బంతులు వేశాడు. ఇందులో 17 నో బాల్స్ ఉన్నాయి. ఈ ఓవర్‌ను లెక్కించడంలో అంపైర్ కూడా అలసిపోయాడు. ఈ ఓవర్‌లో మొత్తం 77 పరుగులు వచ్చాయి. ఇందులో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.
70 పరుగులు పిండుకున్న బ్యాటర్..
కాంటర్బరీ బ్యాట్స్‌మన్ లీ జర్మన్ 22 బంతుల్లో 70 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో జట్టు గెలవడానికి కేవలం 18 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఈ ఇద్దరు బ్యాటర్స్ కలిసి 17 పరుగులు చేయగలిగారు. ఈ విధంగా 2 ఓవర్లలో 94 పరుగులు వచ్చాయన్నమాట. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచిపోయింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..