AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs RR: కోహ్లీ, హేజల్‌వుడ్‌ కాదు.. ఆర్సీబీ గెలుపు వెనుక అసలు హీరో అతనే!

ఐపీఎల్ 2025లో బెంగళూరులో వరుస ఓటములతో అలసిపోయిన ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (70) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ 205 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో హేజెల్‌వుడ్‌ అద్భుత బౌలింగ్‌, జితేష్ శర్మ కీలకమైన రివ్యూ నిర్ణయం ఆర్సీబీ విజయానికి దోహదపడ్డాయి.

RCB vs RR: కోహ్లీ, హేజల్‌వుడ్‌ కాదు.. ఆర్సీబీ గెలుపు వెనుక అసలు హీరో అతనే!
Rcb
SN Pasha
|

Updated on: Apr 25, 2025 | 6:52 PM

Share

ఐపీఎల్‌ 2025లో సొంత మైదానంలో వరుస ఓటములకు ఆర్సీబీ బ్రేక్‌ వేసింది. ఈ సీజన్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్‌లో ఓడిపోయిన ఆర్సీబీ.. గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ విక్టరీ సాధించింది. చివరి రెండు ఓవర్లలో 18 పరుగుల డిఫెండ్‌ చేసుకొని ఔరా అనిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీకి సూపర్‌ స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ అద్భుతమైన స్టార్ట్‌ అందించాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 70 పరుగులు చేసి అదరగొట్టాడు. కోహ్లీతో పాటు దేవదత్‌ పడిక్కల్‌ 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేసి దుమ్మురేపాడు. టిమ్‌ డేవిడ్‌ 23, జితేష్‌ శర్మ 10 బంతుల్లో 20 రన్స్‌ చేసి మంచి ఫినిష్‌ ఇచ్చారు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఈ సీజన్‌లో తొలిసారి 200 ప్లస్‌ స్కోర్‌ చేసింది. ఇంత పెద్ద స్కోర్‌ను కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలో తడబడినా.. కృనాల్‌ పాండ్యా, జోష్‌ హేజల్‌వుడ్‌ సూపర్‌ బౌలింగ్‌తో రాజస్థాన్‌ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాక్కున్నారు.

ఈ మ్యాచ్‌ విజయంలో విరాట్‌ కోహ్లీ, హేజల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్యా పాత్ర చాలా ఉంది. కానీ, రాజస్థాన్‌ ఆల్‌మోస్ట్‌ గెలిచేసింది అనే మూమెంట్‌లో వికెట్‌ కీపర్‌ జితేష్‌ శర్మ తీసుకున్న ఓ రివ్యూ మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పేసింది. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేసి.. మ్యాచ్‌ను ఈజీగా ఫినిష్‌ చేసేలా కనిపించాడు ఆర్‌ఆర్‌ బ్యాటర్‌ ధృవ్‌ జురెల్‌. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్‌లో జురెల్‌ ఓ సిక్స్‌, రెండు ఫోర్లు బాదేసి.. మ్యాచ్‌ను రాజస్థాన్‌దే అని డిసైడ్‌ చేశాడు. అతని కొట్టుడు చూసి.. ఆర్సీబీ ఆటగాళ్ల ముఖాలు మాడిపోయాయి, భుజాలు జారిపోయాయి.. హోం గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ కూడా పోయినట్టే అని అంతా అనుకున్నారు. ఆర్సీబీ అభిమానులతో నిండిపోయిన ఎర్ర సముద్రంలా మారిన చిన్నస్వామి స్టేడియంలో నిశ్శబ్ధ భూతం ఆవహించింది. అలాంటి టైమ్‌లో హేజల్‌వుడ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ మూడో బంతిని వైడ్‌ ఆఫ్‌ ది ఆఫ్‌ స్టంప్‌ యార్కర్‌గా వేశాడు.

ఆ బాల్‌ను అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేయని జురెల్‌.. ఆ బాల్‌కు షాట్‌ ఆడలేకపోయాడు. బాల్‌ వెళ్లి కీపర్‌ జితేష్‌ చేతుల్లో పడింది. హమ్మయ్య డాట్‌ బాల్‌ అనుకొని.. అంతా ఊపరి పీల్చుకున్నారు. హేజల్‌వుడ్‌ కూడా నెక్ట్స్‌ బాల్‌ వేసేందుకు వెనక్కి వెళ్తున్నాడు. కానీ, కీపర్‌ జితేష్‌ మాత్రం క్యాచ్‌ అవుట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు. వీడికేమైనా పిచ్చా.. ఒక వేళ బాల్‌ బ్యాట్‌కు తాకినా.. గ్రౌండ్‌పై పడి ఉంటుందని ఫ్యాన్స్‌ అనుకున్నారు. జితేష్‌ అప్పీల్‌ను ఆర్సీబీ ఆటగాళ్లు కూడా సీరియస్‌గా తీసుకోలేదు. అయినా కూడా జితేష్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ను ఒప్పించి రివ్యూ తీసుకునేలా చేశాడు. సరే మ్యాచ్‌ చివరి కి వచ్చేసింది ఎలాగో గెలిచేలా కూడా లేరు, ఉన్న రివ్యూను వేస్ట్‌ ఎందుకు చేయడం అంటూ తీసుకుంటున్నారులే.. అని అంతా అనుకున్నారు.

కానీ, రీప్లే చూస్తే.. అందరి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. ఆ దెబ్బకు విరాట్‌ కోహ్లీ కూడా చెవులు మూసుకున్నాడు. ఎందుకంటే.. బాల్‌ స్టప్‌ పడిన తర్వాత బ్యాట్‌కు తాకి వికెట్‌ కీపర్‌ చేతుల్లో సేఫ్‌గా పడింది. థర్డ్‌ అంపైర్‌ అవుట్‌ ప్రకటించాడు అంతే.. ఆర్సీబీ జట్టులో తెలియని ఎనర్జీ వచ్చేసింది. ఆ నెక్ట్స్‌ బాల్‌కు ఆర్చర్‌ అవుట్‌. మ్యాచ్‌ ఒక్కసారిగా ఆర్సీబీ చేతుల్లోకి వచ్చేసింది. జితేష్‌ శర్మ ఆ రివ్యూ తీసుకోవడానికి బలవంతం చేసి ఉండకపోతే.. కచ్చితంగా ఆర్సీబీ రివ్యూ తీసుకొనేది కాదు, అంపైర్‌, బౌలర్‌, కెప్టెన్‌, మిగిలిన ప్లేయర్లు ఎవరూ కూడా బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుందని అనుకోలేదు. కానీ, జితేష్‌ ఒక్కడే బలంగా నమ్మాడు.. రిజల్ట్‌ సాధించాడు. మ్యాచ్‌ ఆల్‌మోస్ట్‌ వన్‌సైడ్‌ అయిన తర్వాత పడిన ఆ వికెట్‌ ఆర్సీబీకి విజయాన్ని అందించింది. సో.. జితేష్‌ శర్మ ఇజ్‌ ది రియల్‌ హీరో.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..