CSK vs SRH: ధోని @ 400.. అరుదైన రికార్డులో చేరనున్న చెన్నై సారథి.. హైదరాబాద్‌కు బడిత పూజే?
MS Dhoni Records: ఈ మ్యాచ్ చెన్నై, హైదరాబాద్ జట్లకు డూ ఆర్ డై పరిస్థితిలా మారింది. ఐపీఎల్ 2025 సీజన్ రెండు జట్లకు షాక్ లాంటిదే. 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. హైదరాబాద్ తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇప్పుడు రెండు జట్లు సీజన్‌లోని మిగిలిన భాగంలో తిరిగి పునరాగమనం చేయాలని ఆసక్తిగా ఉన్నాయి.

MS Dhoni To Play 400th T20: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుత చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో పాల్గొన్న అతి పెద్ద వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2024 సీజన్‌కు ముందు ఎంఎస్ ధోని చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఎంఎస్ ధోని @ 400వ టీ20 మ్యాచ్..
నేడు చెపాక్‌లో ఐపీఎల్ సీజన్ 18 వ సీజన్‌లో భాగంగా 43వ మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తపలడనుంది. ప్రస్తుత చెన్నై కెప్టెన్ ధోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే టీ20లో భారీ చరిత్రను సృష్టించనున్నాడు. ధోని నేడు తన 400వ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ధోని టీ20 కెరీర్ గురించి మాట్లాడితే, 399 మ్యాచ్‌ల్లో 350 ఇన్నింగ్స్‌ల్లో 7566 పరుగులు చేశాడు. ఈ పరుగులు 38.02 సగటు, 135.90 స్ట్రైక్ రేట్‌తో సాధించాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
ధోని మొత్తం 98 3అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 126.13 స్ట్రైక్ రేట్‌తో 1617 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ధోని ఐపీఎల్‌లో 272 మ్యాచ్‌లు ఆడాడు. 137.87 స్ట్రైక్ రేట్‌తో 5377 పరుగులు చేశాడు. ఇక దేశీయ క్రికెట్‌లో జార్ఖండ్ తరపున మొత్తం 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఛాంపియన్స్ లీగ్‌లో చెన్నై తరపున 449 పరుగులు చేశాడు.
400 టీ20 మ్యాచ్‌లు ఆడిన నాల్గవ భారత ఆటగాడిగా..
ఐపీఎల్‌లో 400 మ్యాచ్‌లు ఆడిన నాలుగో భారత ఆటగాడిగా ధోనీ నిలిచాడు. దీనికి ముందు, రోహిత్ 456 మ్యాచ్‌లు ఆడి 12058 పరుగులు చేశాడు. దీంతో టీ20లో అత్యధికంగా ఆడిన భారత ఆటగాడిగా నిలిచాడు. 412 మ్యాచ్‌ల్లో 7537 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 412 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 408 మ్యాచ్‌ల్లో 13278 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ చెన్నై, హైదరాబాద్ జట్లకు డూ ఆర్ డై పరిస్థితిలా మారింది. ఐపీఎల్ 2025 సీజన్ రెండు జట్లకు షాక్ లాంటిదే. 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. హైదరాబాద్ తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇప్పుడు రెండు జట్లు సీజన్‌లోని మిగిలిన భాగంలో తిరిగి పునరాగమనం చేయాలని ఆసక్తిగా ఉన్నాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








