ఏనుగు దయచూపించింది.. లేదంటే వీడియో
సాధారణంగా ఏనుగులను అందరూ ఇష్టపడతారు. గజరాజుగా పిలిచే ఏనుగులు చూడటానికి ప్రశాంతంగానే కనిపిస్తాయి. కానీ వాటికి ఎవరైనా హాని తలపడితే మాత్రం అంత చూస్తాయి. కోపం వచ్చినప్పుడు గజరాజు ఘీంకరించిందంటే హడలిపోవాల్సిందే. అలాంటి సంఘటనలు తరచు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఏనుగుకు కోపం వచ్చిందంటే ఆ ప్రాంతమంతా భీభత్సం సృష్టిస్తుంది. ఒక్కసారి దానికి చిర్రెత్తుకు వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా ఉండదు. భారీ వృక్షాలను సైతం కూల్చివేయడంతో పెకలించేస్తాయి. అలాంటి ఓ ఏనుగు భయంతో ఇద్దరు వ్యక్తులు తప్పించుకునే వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.
ఏనుగును దగ్గరనుంచి చూసేందుకు ప్రయత్నించి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని మైసూర్ రోడ్డు పై జరిగింది. ఇద్దరు వ్యక్తులు కారులో వెళుతుండగా వారికి ఏనుగు కనిపించింది. దీంతో కారు దిగి దానిని దగ్గర నుంచి చూసేందుకు వెళ్ళారు. ఇంకేముంది ఆ ఏనుగు వారితో ఓ ఆట ఆడేసుకుంది. ఉన్నట్టుండి వారిని వెంబడించింది. దాంతో బతుకు జీవుడా అంటూ ఆ ఇద్దరు ప్రాణాలు అరి చేతుల్లో పెట్టుకొని పరుగు అందుకున్నారు. ఒక అతను పరుగెత్తలేక కిందపడిపోయాడు. ఏనుగు అతన్ని తన వెనుక కాళ్ళతో తన్ని వదిలి పెట్టింది. ఎందుకో అతని మీద దయతలచి తొక్కకుండా వదిలి పెట్టింది. దెబ్బకు బతుకు జీవుడా అంటూ అక్కడినుంచి పాకుతూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఏనుగు బతుకు పో మరోసారి నాతో ఆటలాడా లని ప్రయత్నిస్తే మామూలుగా ఉండదని అన్నట్టుగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

