AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నకిలీ పన్నీర్.. విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో గుర్తించండి వీడియో

నకిలీ పన్నీర్.. విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో గుర్తించండి వీడియో

Samatha J

|

Updated on: Apr 28, 2025 | 10:49 PM

వెజిటేరియన్స్ తో పాటు నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో పన్నీర్ ఒకటి. నాన్ వెజ్ తిని బోర్ కొట్టిన వెజ్ లో వెరైటీ కోరుకున్నా చాలా మంది పన్నీర్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్ ఇంటేక్ లో ఎక్కువ మొత్తాన్ని ఇది భర్తీ చేస్తుంది. అంతేకాదు పన్నీర్ తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. ఒకప్పుడు దీనికి అంతగా డిమాండ్ లేదు. కానీ ఇప్పుడిప్పుడే పన్నీర్ పైన అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఈ డిమాండ్ పెరిగిందో అప్పటి నుంచి కల్తీ కూడా మొదలైంది. ఇటీవల బెంగళూరు, అహ్మదాబాద్ లో ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు జరిపిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల పన్నీర్ శాంపిల్స్ సేకరించి పరిశీలించగా వాటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తెలింది.

అలాంటి కల్తీ పన్నీర్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పన్నీర్ తో వంటలు చేసుకొని తినాలనిపించినప్పుడు మార్కెట్లో కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ ని తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. కల్తీ మోసపు నుంచి తప్పించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని టెస్ట్ ల ద్వారా ఫేక్ పన్నీర్ ను సులువుగా గుర్తించొచ్చు. అందులో మొదటి టెస్ట్ ఏంటంటే పన్నీర్ ని తాకి చూడాలి. ప్రెస్ చేసి చూసినప్పుడు నిజమైన పన్నీర్ అయితే వెంటనే ముక్కలైపోతుంది. స్టార్చ్ లేదా సింథటిక్ పదార్థాలను కలిపిందైతే ప్రెస్ చేసినా అలాగే ఉంటుంది తప్ప ముక్కలు కాదు. పైగా రబ్బరును తాకిన ఫీల్ వస్తుంది. నిజమైన పన్నీర్ పాల లాంటి టేస్ట్ ని కలిగి ఉంటుంది. నోకిలిది పుల్లగా ఉంటుంది. పన్నీర్ లో కొన్ని చుక్కలు అయోడిన్ వేస్తే అది నీలం రంగులోకి మారితే స్టార్చ్ కలిపినట్టే.