Bengaluru: 5 గంటలు స్తంభించిన ట్రాఫిక్‌! ఐటీ కంపెనీలకు ఏకంగా రూ.225 కోట్ల నష్టం..

అవిరామంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరు రాష్ట్రం తడిసిముద్దైంది. కుండపోత వానలతో వర్షం నీరు బెంగళూరు నగర రోడ్లను..

Bengaluru: 5 గంటలు స్తంభించిన ట్రాఫిక్‌! ఐటీ కంపెనీలకు ఏకంగా రూ.225 కోట్ల నష్టం..
Traffic
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 04, 2022 | 7:17 PM

Bengaluru IT firms lost Rs.225 crore in a single day: అవిరామంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరు రాష్ట్రం తడిసిముద్దైంది. కుండపోత వానలతో వర్షం నీరు బెంగళూరు నగర రోడ్లను ముంచెత్తింది. ఆగస్టు 30న ప్రయాణికులు ట్రాఫిక్‌లో ఏకంగా 5 గంటల పాటు చిక్కుకోవడంతో ఒక్క రోజు వ్యవధిలో ఐటీ కంపెనీలకు ఏకంగా రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కంపెనీల అసోసియేషన్‌ (ORRCA) బెంగళూరు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశారు. ORR వద్ద మౌలిక సదుపాయాల కొరత ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.. ‘కృష్ణరాజపురం నుంచి బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ వరకు దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు ఉన్నారు. చుట్టూ 17 కిలోమీటర్ల మేర కోటి మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతో కృషి చేసిన మీరు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫెసిలిటీలపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరంగా ఉంది. బెంగళూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పతనావస్థ గురించి ప్రస్తుతం ప్రపంచమంతా చర్చిస్తోంది. ఇది బెంగళూరు సిటీ అభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందని’ లేఖలో పేర్కొన్నారు. ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే కంపెనీలు ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంభించే అవకాశం ఉందని ORRCA ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా బెంగళూరు సీఎం బొమ్మై తాజాగా బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ కాలువలకు అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.