Jharkhand: మరికొద్ది గంటల్లో జార్ఖండ్ శాసనసభ ప్రత్యేక సమావేశం.. ఏం జరుగుతుందనేదానిపై ఉత్కంఠ..
జార్ఖండ్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపినప్పటికి గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అక్కడి రాజకీయం మరింత వేడెక్కింది. బీజేపీ ఎటువంటి ప్లాన్స్..
Jharkhand: జార్ఖండ్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపినప్పటికి గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అక్కడి రాజకీయం మరింత వేడెక్కింది. బీజేపీ ఎటువంటి ప్లాన్స్ వేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా ఉండేలా కాంగ్రెస్, జేఎంఎం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో జార్ఖండ్ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని రిసార్టులో మకాం పెట్టిన అధికార యూపీఏ కూటమి ఎమ్మెల్యేలు తాజాగా స్వరాష్ట్రానికి చేరుకున్నారు. రాయ్‌పుర్ నుంచి ఆదివారం మధ్యాహ్నం ఛార్టెడ్ విమానంలో 30మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాంచీకి చేరుకున్నారు.
సెప్టెంబర్ ఐదో తేదీ సోమవారం జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వంపై వేటు పడనుందని గతకొంతకాలంగా ప్రచారం జరగుతోంది. దీనిపై గవర్నర్ ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఆలస్యం జరుగుతుందంటే దాని వెనకాల ఏదో ప్లాన్ ఉండే ఉంటుందనే అనుమానాలను యూపీఏ కూటమి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు యూపీఏ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అయితే, వారికి నెలకొన్న అనుమానాలకు త్వరలోనే స్పష్టత ఇస్తానన్న గవర్నర్ రమేష్ బైస్.. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఈదశలో జార్ఖండ్ లో యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అధికార కూటమి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌లోని రిసార్టుకు తరలించింది. తాజాగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతున్నందున రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది. రేపు శాసనసభలో ఏం జరుగుతుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..