- Telugu News Photo Gallery Cinema photos Bahubali The Beginning decade celebrations will be held grandly from 10 July 2025 to October
Bahubali: పాన్ ఇండియా ట్యాగ్‌కు 10 వసంతాలు.. బాహుబలి డికేడ్ ఉత్సవాలకు భారీ ప్లాన్..
బాహుబలి ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఇండియన్ సినిమా హిస్టరీని బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అన్నట్టుగా మార్చేసింది ఈ క్లాసిక్ మూవీ. తెలుగు సినిమా పరవేంటో ప్రపంచానికి చాటింది. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
Updated on: Apr 29, 2025 | 11:34 AM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి. ఈ సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్‌ను సిల్వర్ స్క్రీన్‌కు సరికొత్తగా పరిచయం చేశారు జక్కన్న. బలమైన కథ ఉంటే ఎంత బడ్జెట్‌తో అయినా సినిమా తెరకెక్కించొచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చింది బాహుబలి.

ఇందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ నటనకి పాన్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయన లేనిదే భల్లాలదేవ పాత్ర లేదనేలా నటించారు రానా దగ్గుబాటి. రాజమాత శివగామిగా మరి ఎవ్వరిని ఉహించుకోలేనంతగా పాత్రలో ఒదిగిపోయారు రమ్యకృష్ణ. సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్రకు ప్రేక్షకులు ఫిదా. దేవసేనగా అనుష్క పాత్రకి విమర్శకుల ప్రశంసలు లభించాయి.

అలాగే అవంతికగా తమన్నా, బిజ్జలదేవిగా నాజర్, స్వామిజిగా తనికెళ్ళ భరణి, సాంగ పాత్రలో రోహిణి లాంటి వాళ్లు తమ పాత్రలోతో మెప్పించారు. కీరవాణి మ్యూజిక్ సినిమాలో మ్యాజిక్ చేసింది. చిన్న నటుడి నుంచి టెక్నీషియన్స్ వరకు రాజమౌళి వెనుక సైన్యంలా నిలబడి పని చేసారు కాబట్టే అంతటి ఘనత సంధించింది బాహుబలి.

ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసిన బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు కావొస్తుంది. అందుకే ఈ మైల్ స్టోన్ మూమెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది చిత్రయూనిట్. తెలుగు తెరకు కొత్త హైట్స్ చూపించిన బాహుబలి సినిమాను రీ రిలీజ్ చేయబోతోంది.

2015 జూలై 10న బాహుబలి ది బిగినింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రోజు నుంచే డెకెడ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్న యూనిట్ అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. బాహుబలి రిటర్న్స్ పేరుతో సరికొత్తగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చూస్తుంది మూవీ టీమ్. మరి సెకండ్ రిలీజ్‌లోనూ బాహుబలి మ్యాజిక్ రిపీట్ అవుతుందా.. లెట్స్ వెయిట్ అండ్ సీ.




