FD Schemes vs Post Office Schemes : పన్ను ఆదా చేసే పథకాలివే… ఎఫ్‌డీలకు పోస్టాఫీస్ స్కీమ్స్ మధ్య ప్రధాన తేడాలు తెలుసుకోండి..

ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ నిబంధన 80 సీ కింద చెల్లుబాటు అయ్యే పథకాల కోసం చూస్తూ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మీ ఆదాయంపై మరింత ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొన్ని పన్ను ఆదా పథకాలను పథకాలను మీ ముందుకు తీసుకువచ్చాం.

FD Schemes vs Post Office Schemes : పన్ను ఆదా చేసే పథకాలివే... ఎఫ్‌డీలకు పోస్టాఫీస్ స్కీమ్స్ మధ్య ప్రధాన తేడాలు తెలుసుకోండి..
Fixed Deposit
Follow us

|

Updated on: Mar 30, 2023 | 6:00 PM

మనం కష్టించి సంపాదించే ఆదాయంపై పన్ను రాయితీ కోసం వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ నిబంధన 80 సీ కింద చెల్లుబాటు అయ్యే పథకాల కోసం చూస్తూ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మీ ఆదాయంపై మరింత ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొన్ని పన్ను ఆదా పథకాలను పథకాలను మీ ముందుకు తీసుకువచ్చాం. బ్యాంకులు, పబ్లిక్, ప్రైవేట్, పెట్టుబడిదారుల కోసం పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను అందిస్తాయి. దీని ద్వారా పెట్టుబడిదారులు సెక్షన్ 80 C కింద సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఆదా చేయవచ్చు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు బ్యాంకుల పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో చివరిగా పెట్టుబడి పెడతారు. అలాగే ఆదాయపు పన్నును ఆదా చేయడానికి పన్ను చెల్లింపుదారులు పోస్ట్ ఆఫీస్ అందించే కొన్ని పథకాలను కూడా ఎంచుకోవచ్చు. ఇవి ఐదేళ్ల కాలవ్యవధిని కలిగి ఉంటాయి. అలాగే ఇవి కూడా భారత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద చెల్లుబాటు అవుతాయి.  కొన్ని బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్టాఫీసులతో వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని ఓ సారి తెలుసుకుందాం.

బ్యాంక్ ఎఫ్‌డీలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును సవరించినప్పటి నుంచి అనేక బ్యాంకులు పన్ను ఆదా చేయడానికి ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మే 2022 నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల ద్వారా 6.50 శాతానికి సవరించింది. దీంతో బ్యాంకులు తమ ఎఫ్‌డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.75 శాతం రేటును అందిస్తున్నాయి.  యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.5 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ బ్యాంక్ వరుసగా 7.15 శాతం, 7.5 శాతం, 7 శాతం వడ్డీ రేట్లను అందిస్తాయి. ఐదు సంవత్సరాల ఎఫ్‌డీ కోసం ఎస్‌బీఐ వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంటుంది. 

పోస్టాఫీస్ పన్ను ఆదా పథకాలు ఇవే

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు

పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) అనేది స్థిర-ఆదాయ పెట్టుబడి పథకం. దీనికి కేంద్రం మద్దతు ఇస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు. ప్రస్తుత వడ్డీ రేటు 7 శాతంగా. ప్రారంభ పెట్టుబడిగా రూ.100 కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ పథకానికి గరిష్ట పరిమితి లేదు. 

ఇవి కూడా చదవండి

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్

పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా అనేది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటుంది. ఈ త్రైమాసికంలో ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. కనీస పెట్టుబడి రూ. 1000గా ఉంటే గరిష్ట పెట్టుబడికి మాత్రం పరిమితి లేదు. ఖాతాదారుడి పొదుపు ఖాతాలో వార్షిక వడ్డీని జమ చేస్తారు. భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చే ఇతర చిన్న పొదుపు పథకాల మాదిరిగానే ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటు సవరిస్తారు.

సీనియర్  సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

సీనియర్ సిటిజన్లు వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పెట్టుబడిగా రూ.1000 ఉంటే, గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలుగా ఉంది. ఈ పెట్టుబడి ఐదేళ్ల కాల వ్యవధిని కలిగి ఉంది. ఈ పథకం అదనపు మూడేళ్లపాటు మెచ్యూరిటీకి చేరుకున్న తర్వాత పునరుద్ధరించబడుతుంది. జనవరి-డిసెంబర్ త్రైమాసికానికి కేంద్రం తన వడ్డీ రేటును సవరించిన తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్లపై సంవత్సరానికి ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!