Post Office Schemes: వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీసు పథకాలలో మార్పులు

మార్చి నెల ముగియబోతోంది. ఏప్రిల్‌ నెల వస్తోంది. వచ్చే నెల ఫైనాన్షియల్‌ సెక్టర్‌తో పాటు వివిధ ప్రభుత్వ పథకాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూనియన్ బడ్జెట్ 2023 అత్యంత ప్రజాదరణ పొందిన రెండు పోస్టాఫీసు పథకాలలో కొన్ని మార్పులు చేసింది కేంద్రం. మహిళా పెట్టుబడిదారుల కోసం..

Post Office Schemes: వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీసు పథకాలలో మార్పులు
Post Office
Follow us

|

Updated on: Mar 28, 2023 | 1:51 PM

మార్చి నెల ముగియబోతోంది. ఏప్రిల్‌ నెల వస్తోంది. వచ్చే నెల ఫైనాన్షియల్‌ సెక్టర్‌తో పాటు వివిధ ప్రభుత్వ పథకాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూనియన్ బడ్జెట్ 2023 అత్యంత ప్రజాదరణ పొందిన రెండు పోస్టాఫీసు పథకాలలో కొన్ని మార్పులు చేసింది కేంద్రం. మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, లేదా అందులో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని మార్పులను గమనించాలి.

2023 బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్‌) పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు. ప్రభుత్వ మద్దతుగల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 2004లో వృద్ధులకు వారి పదవీ విరమణ అనంతర సంవత్సరాల్లో సురక్షితమైన ఆదాయం అందించాలనే లక్ష్యంతో ఏర్పాలు చేసింది. ఈ జనవరి-మార్చి త్రైమాసికానికి సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై అందించే వడ్డీ రేటు 8%. కనిష్ట డిపాజిట్ రూ. 1000, అలాగే మల్టిపుల్ 1000తో 5 సంవత్సరాలకు నిర్ణయించబడుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ పన్ను ఉచితం కాదని గుర్తించుకోవాలి.

బడ్జెట్ 2023 ప్రకారం.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కోసం సింగిల్ ఖాతాదారుల పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ హోల్డింగ్ కోసం పరిమితి రూ.9 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచారు. అలాగే నెలవారీ ఆదాయ పథఖం పెట్టుబడిదాఆరులు ప్రతి నెల వడ్డీ చెల్లింపులను పొందుతారు.

ఇవి కూడా చదవండి

అందు కోసం వడ్డీ రేటును ప్రభుత్వం క్రమం తప్పకుండా అందిస్తుంది. ప్రస్తుతం 2023 జనవరి నుంచి మార్చి వరకు వడ్డీ రేటు 7.1%. మంత్రీ ఇన్కమ్‌ స్కీమ్‌ ఖాతా ఐదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఒక వేళ 3 సంవత్సరాల తర్వాత స్కీమ్‌ను క్లోజ్‌ చేయాలనుకుంటే ఖాతా తెరిచిన తేదీ నుంచి 5 సంవత్సరాల ముందు ప్రిన్సిపాల్‌ అమౌంట్‌లో 1% కట్‌ చేసి చెల్లిస్తారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళా ఇన్వెస్టర్లే లక్ష్యంగా.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చింది. రెండేళ్ల కాలవ్యవధితో వన్ టైం స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఇది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌ను పురస్కరించుకొని.. మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక 2025లో ఈ పథకం ముగుస్తుందని వెల్లడించారు. ఇందులో గరిష్టంగా 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇక గరిష్టంగా ఒక్కో పేరు మీద ఇందులో రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?