Income Tax Rules: వినియోగదారులకు అలర్ట్.. ఇంకా మూడు రోజులే గడువు.. ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను శాఖలో కొత్త నిబంధనలు
మార్చి నెల ముగియబోతోంది. ఏప్రిల్ నెల రాబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను విషయంలో పలు నిబంధనలు మారనున్నాయి. అయితే ఇంకా మూడే రోజుల గడువు ఉంది. వినియోగదారులు ఈ నిబంధనలు ఏమిటో లెలుసుకోవడం చాలా ముఖ్యం. మరో మూడు రోజుల్లోగా ఆదాయపు పన్నును మార్చి 31లోగా..
మార్చి నెల ముగియబోతోంది. ఏప్రిల్ నెల రాబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను విషయంలో పలు నిబంధనలు మారనున్నాయి. అయితే ఇంకా మూడే రోజుల గడువు ఉంది. వినియోగదారులు ఈ నిబంధనలు ఏమిటో లెలుసుకోవడం చాలా ముఖ్యం. మరో మూడు రోజుల్లోగా ఆదాయపు పన్నును మార్చి 31లోగా సమర్పించాలి. దేశ ప్రజలలో అధిక భాగం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు. మీరు కూడా ఈ ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే, కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను సమర్పణ నిబంధనలు మారుతున్నాయి. మీకు ఈ నియమాలు తెలియకపోతే, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలలో పన్ను మినహాయింపు పరిమితులు కూడా మారాయి.
ఆదాయపు పన్ను నిబంధనలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రూల్ ప్రకారం రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. గతంలో ఈ పన్ను మినహాయింపు రూ.5 లక్షలకు పరిమితమైంది. అంటే వార్షిక ఆదాయం రూ.7 లక్షలు ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- పాత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు రూ.50,000 వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందేవారు. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, రిటైర్డ్ ఉద్యోగులు రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయంపై రూ.52,500 వరకు తగ్గింపు పొందుతారు.
- ప్రయివేటు ఉద్యోగుల విషయానికొస్తే, లీవ్ క్యాష్‌మెంట్ పరిమితి రూ.3 లక్షలు. ఈ ఆర్థిక పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు.
- ఏప్రిల్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల కింద పన్ను విధించబడుతుంది.
- ఎల్‌ఐసీ వార్షిక ప్రీమియం రూ. 5 లక్షలు అయితే దాని ద్వారా వచ్చే ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.
- సీనియర్ సిటిజన్ పథకంలో గరిష్ట డిపాజిట్ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు
కొత్త ఆదాయపు పన్ను పరిమితి:
- 3 లక్షల వరకు సంపాదనపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్నట్లయితే 5% వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- 6 నుంచి 9 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 10 శాతం ఆదాయపు పన్నును డిపాజిట్ చేయాలి.
- 9 నుంచి 12 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 15 శాతం ఆదాయపు పన్నును డిపాజిట్ చేయాలి.
- రూ.12 నుంచి రూ.15 లక్షల మధ్య వార్షిక ఆదాయాలపై 20 శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించాలి.
- 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే ఆదాయపు పన్ను 30 శాతం చొప్పున డిపాజిట్ చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి