EPFO Interest Rate: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు పెంపు.. పూర్తి వివరాలివే..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

EPFO Interest Rate: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు పెంపు.. పూర్తి వివరాలివే..
EPFO
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 28, 2023 | 11:43 AM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో పదవీ విరమణ నిధి సంస్థ – ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ (EPFO) 2022-23 ఆర్థిక సంవత్సరానికి EPFపై 8.15% వడ్డీ రేటును నిర్ణయించింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీ రేటును ఇప్పటికే ఉన్న దానిపై 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నిర్ణయం 5 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు మేలు జరగనుంది. ‘‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) మంగళవారం జరిగిన సమావేశంలో 2022-23 సంవత్సరానికి EPF పై 8.15 శాతం వడ్డీని అందించాలని నిర్ణయించింది” అని వార్తా సంస్థ PTI పేర్కొంది.

అయితే, ఈపీఎఫ్ఓ గత ఆర్థిక సంవత్సరానికి అతి తక్కువగా 8.1 శాతం వడ్డీ ప్రకటించగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఇంకా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈసారి వడ్డీ రేటు 8 శాతానికి తగ్గిస్తారని భావించినప్పటికీ.. ఈపీఎఫ్ఓ 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా, ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర నిబంధనల చట్టం – 1952 ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ పొదుపు తప్పనిసరి. ఒక ఉద్యోగి ప్రాథమిక జీతంలో కనీసం 12 శాతం తప్పనిసరిగా భవిష్యనిధిలో ఆదా చేయడానికి తప్పనిసరి. అయితే దీంతోపాటు యజమాని కూడా సమాన మొత్తాన్ని జమచేస్తారు.

గతేడాది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి.. నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి తగ్గించారు. 1977-78 తర్వాత ఉద్యోగులు తమ రిటైర్‌మెంట్ ఫండ్‌లో చేసే డిపాజిట్లపై ఇది అతి తక్కువ వడ్డీ రేటు. ఆ ఏడాది ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!