AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income tax savings tips : మెరుగైన పెట్టుబడులతో ఆదాయపు పన్ను ఆదా.. ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు మూడు పన్ను ఆదా ఎంపికలు అవసరం. మొదటిది ఆరోగ్య బీమా, రెండవది టర్మ్ ఇన్సూరెన్స్, మూడవది పన్ను ఆదా చేసి తమ రాబడిని పెంచుకునే పథకాల్లో పెట్టుబడులు. కొంత మంది వ్యక్తుల ఆదాయపు పన్ను నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టినా.. వాటిపై వచ్చే వడ్డీ రాబడిపై మాత్రం పన్ను చెల్లించాల్సి వస్తుందని చెబుతూ ఉంటారు.

Income tax savings tips : మెరుగైన పెట్టుబడులతో ఆదాయపు పన్ను ఆదా.. ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Income Tax
Nikhil
|

Updated on: Mar 30, 2023 | 6:30 PM

Share

నెలనెలా కష్టపడి సంపాదించిన సొమ్మును కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ నమ్మకమైన రాబడి పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే రాబడి పొందడం ఎంత ముఖ్యమో? పన్ను ఆదా చేసే పథకాల్లో పెట్టుబడి పెట్టడం అంతే ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు మూడు పన్ను ఆదా ఎంపికలు అవసరం. మొదటిది ఆరోగ్య బీమా, రెండవది టర్మ్ ఇన్సూరెన్స్, మూడవది పన్ను ఆదా చేసి తమ రాబడిని పెంచుకునే పథకాల్లో పెట్టుబడులు. కొంత మంది వ్యక్తుల ఆదాయపు పన్ను నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టినా.. వాటిపై వచ్చే వడ్డీ రాబడిపై మాత్రం పన్ను చెల్లించాల్సి వస్తుందని చెబుతూ ఉంటారు. కాబట్టి నమ్మకమైన పెట్టుబడి పెట్టడంతో పాటు రాబడి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో నమ్మకమైన పెట్టుబడితో పాటు పన్ను ఆదా చేసే పథకాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

జీవిత బీమా

మీపై ఆధారపడిన వారికి తగిన ఆర్థిక రక్షణ ఇవ్వడం అనేది మీ పెట్టుబడికి మొదటి మెట్టుగా ఉంటుంది. మీకు తగిన జీవిత బీమా ఉందో? లేదో? తనిఖీ చేయాలి. తక్కువ ఖర్చుతో అధిక జీవిత బీమా కవరేజీని అందించే టర్మ్ లైఫ్ ప్లాన్‌ని తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతుననారు. ముఖ్యంగా వీటికి కట్టే ప్రీమియంలకు సెక్షన్ 80సీ వర్తిస్తుంది. కేవలం పన్ను ఆదా కోసం చాలా మంది వ్యక్తులు సంప్రదాయ ఎండోమెంట్ లేదా మనీ-బ్యాక్ ప్లాన్‌ల వంటి పెట్టుబడి, జీవిత బీమా ప్లాన్‌లను కొనుగోలు చేస్తారు. ఈ ప్లాన్‌లు పెద్ద జీవిత బీమా కవర్‌ను లేదా మంచి రాబడిని అందించవని గుర్తు పెట్టుకుంటే మంచిది. మీరు అల్ట్రా-కన్సర్వేటివ్ సేవర్ అయితే తప్ప వీటిని నివారించడం ఉత్తమం. బీమా కంపెనీలు అందించే యులిప్‌లు (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు) మీకు మార్కెట్ లింక్డ్ రిటర్న్‌ను అందిస్తాయి. ఇవి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం బాగా పని చేస్తాయి. అయితే, మీరు వాటి ధరను తగ్గించినా ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీల పరంగా ఎంఎఫ్‌లతో తో పోల్చదగిన యులిప్‌లకే వెళ్లాలని మీరు నిర్ధారించుకోవడం ఉత్తమం.

వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) లేదా పీపీఎఫ్

పదవీ విరమణ వంటి జీవిత లక్ష్యాల కోసం మీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలంటే వీపీఎఫ్ లేదా పీపీఎఫ్‌ల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. మీరు ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను పెంచడానికి, ఆదా చేయడానికి ఈఎల్‌ఎస్‌ఎస్ నిధులను ఉపయోగించవచ్చు. ఇప్పటికే ఈక్విటీ ఫండ్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటే, మీ పీఎఫ్ కార్పస్ తులనాత్మకంగా తక్కువగా ఉంటే, మీ ప్రావిడెంట్ ఫండ్ కార్పస్‌ను పెంచడంతో పాటు పన్ను ఆదా చేయడానికి మీ వీపీఎఫ్ సహకారాన్ని పెంచాలి. మీకు వీపీఎఫ్ అందుబాటులో లేకుంటే మీ పీపీఎఫ్ ఖాతాకు రూ. 1.5 లక్షల వరకు జమ చేచయడం ఉత్తమం. ఈపీఎఫ్, పీపీఎఫ్‌పై రాబడులు సురక్షితమైన స్థిర ఆదాయ పెట్టుబడి ఎంపికలలో అత్యధికంగా ఉన్నాయి. వాటికి వచ్చే రిటర్న్‌లు కూడా పన్ను రహితంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఈఎల్ఎస్ఎస్

ఈఎల్ఎస్ఎస్ అంటే దీర్ఘకాలిక జీవిత లక్ష్యాల కోసం ఉద్దేశించి రూపొందించనవి. అయితే అన్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి. కొన్ని లార్జ్ క్యాప్ ఓరియెంటెడ్, మరికొన్ని మిడ్-స్మాల్ క్యాప్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. మీరు ఇప్పటికే కొన్ని ఈక్విటీ ఫండ్‌లను కలిగి ఉన్నట్లయితే, మార్కెట్ క్యాప్ సెగ్మెంట్‌లకు మీరు ఏ మొత్తం కేటాయింపును కోరుకుంటున్నారనే దాని ఆధారంగా వాటికి బాగా సరిపోయే ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను ఎంచుకోవాలి. ఈఎల్ఎస్ఎస్‌పై రూ. 1 లక్ష వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను నుంచి మినహాయించబడతాయి. రూ. 1.5 లక్షల పెట్టుబడిపై రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ లాభం పొందడం చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి, మీరు 3 సంవత్సరాల లాక్-ఇన్ తర్వాత నిష్క్రమిస్తే మీ మొత్తం లాభంపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది.

ఎన్‌పీఎస్

పదవీ విరమణ తర్వాత జీవితానికి బాగా మద్దతునిచ్చే తగినంత పదవీ విరమణ కార్పస్ కలిగి ఉండటం చాలా మంది వ్యక్తులకు అతిపెద్ద సవాలుగా ఉంటుంది. ఎన్‌పీఎస్ అలాంటి అవకాశాన్ని అందిస్తుంది. జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో మీ పెట్టుబడి సంవత్సరానికి రూ. 50,000 వరకు 80సీసీడీ (1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనాలను పొందుతుంది. ఎన్‌పీఎస్ అనేది పదవీ విరమణ తర్వాత మాత్రమే చేతికి వచ్చే పథకం. మీరు పెట్టే పెట్టుబడి ఏ ఇతర లక్ష్యాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉండదు. కేవలం పదవీవిరమణ తర్వాత మన పెట్టుబడి చేతికి వస్తుంది. ముఖ్యంగా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెడితే అదనపు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఎన్‌పీఎస్ పెట్టుబడిపై ఆర్జించిన రాబడికి పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే మీరు పదవీ విరమణ సమయంలో మీ కార్పస్‌లో 60 శాతం వరకు మాత్రమే ఏకమొత్తంగా పొందుతారు. మిగిలిన 40 శాతం కార్పస్‌తో మీరు యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. అయితే ఈ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..