New Record: ఇడ్లీ ఆర్డర్‌లో రికార్డ్‌ సృష్టించిన హైదరాబాదీ.. ఒక్క యేడాదిలో 6 లక్షల విలువైన 8,428 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్‌..

సాదా ఇడ్లీ అన్ని నగరాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వేరియంట్. రవ్వ ఇడ్లీ ఇతర నగరాల కంటే బెంగుళూరులో బాగా ప్రాచుర్యం పొందింది, అయితే నెయ్యి, నెయ్యి కారం పొడి ఇడ్లీ తమిళనాడు, ఏపీ, తెలంగాణాలోని నగరాల్లో ప్రసిద్ధి చెందింది.

New Record: ఇడ్లీ ఆర్డర్‌లో రికార్డ్‌ సృష్టించిన హైదరాబాదీ.. ఒక్క యేడాదిలో 6 లక్షల విలువైన 8,428 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్‌..
Idli
Follow us

|

Updated on: Mar 30, 2023 | 6:55 PM

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ రికార్డ్‌ సృష్టించింది. భారత్‌లో కేవలం గత 12 నెల్లలోనే 33 మిలియన్ ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ తన తాజా నివేదికలో పేర్కొంది. కస్టమర్లలో ఈ వంటకానికి ఉన్న విపరీతమైన ఆదరణే కారణమని ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా స్విగ్గీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక సాంప్రదాయ వంటకాలు ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రంలోనైనా సరే ఇడ్లీకి ఆదరణ తగ్గలేదని స్విగ్గీ తెలిపింది. ఇక సౌత్‌ ఇండియాలో ఇడ్లీ అత్యంత ప్రజాదరణ పొందిందని, ఇప్పటికీ, ఎప్పటికీ అలాగే ఉందని పేర్కొంది. ఇక ప్రపంచంలోనే ఇడ్లీలు ఎక్కువగా ఆర్డర్ చేసే మొదటి 3 నగరాలుగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నిలిచాయి. వీటి తర్వాత ఢిల్లీ, కోల్‌కతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పూణే, వైజాగ్ సిటీలు ఉన్నాయి.

హైదరాబాద్‌కు చెందిన ఓ స్విగ్గీ వినియోగదారు గతేడాది గరిష్టంగా ఇడ్లీలను ఆర్డర్ చేశారు. ఇండ్లీలకోసం అతను ఏకంగా 6 లక్షలు వెచ్చించారు. తానూ ఆర్డర్‌ చేయడమే కాదు, అతను బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణించినప్పుడు స్నేహితులు, కుటుంబసభ్యుల కోసం కూడా ఇడ్లీలు ఎక్కువగా ఆర్డర్‌లు ఇచ్చినట్లు స్విగ్గీ ప్రత్యేకంగా పేర్కొంది. మొత్తంమీదా…ఆ వినియోగదారుడు ఒక యేడాదిలో 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారట.

సాదా ఇడ్లీ అన్ని నగరాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వేరియంట్. రవ్వ ఇడ్లీ ఇతర నగరాల కంటే బెంగుళూరులో బాగా ప్రాచుర్యం పొందింది, అయితే నెయ్యి, నెయ్యి కారం పొడి ఇడ్లీ తమిళనాడు, ఏపీ, తెలంగాణాలోని నగరాల్లో ప్రసిద్ధి చెందింది. అన్ని నగరాల్లోని ఇడ్లీ ఆర్డర్‌లలో తట్టే ఇడ్లీ, మినీ ఇడ్లీలు కూడా క్రమం తప్పకుండా కనిపిస్తాయని పేర్కొంది. కస్టమర్లు తమ ఇడ్లీలతో పాటు సాంబార్, కొబ్బరి చట్నీ, కారంపొడి, నెయ్యి, రెడ్ చట్నీ, జైన్ సాంబార్, టీ, కాఫీ ఇతర వంటకాలను కూడా ఆర్డర్ చేస్తారని స్విగ్గీ పేర్కొంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం