Medicines Price: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఈ వ్యాధుల మందుల ధరలు తగ్గింపు..!

ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా మందులు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి కొన్ని రకాల మందుల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి పెరుగుతుంటే మరికొన్ని మందుల ధరలు తగ్గిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు..

Medicines Price: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఈ వ్యాధుల మందుల ధరలు తగ్గింపు..!
Medicines
Follow us
Subhash Goud

|

Updated on: Mar 30, 2023 | 9:31 PM

ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా మందులు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి కొన్ని రకాల మందుల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి పెరుగుతుంటే మరికొన్ని మందుల ధరలు తగ్గిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురై విదేశాల నుంచి మందులను దిగుమతి చేసుకోవాల్సిన దేశ ప్రజలకు భారత ప్రభుత్వం ఎంతో ఊరటనిచ్చింది. నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ 2021 కింద జాబితా చేయబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం దిగుమతి చేసుకున్న మందులపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆ మందుల ధరలు తగ్గనున్నాయి.

వ్యక్తిగత ఉపయోగం కోసం ఔషధాలను దిగుమతి చేసుకునే వ్యక్తులకు మాత్రమే ఈ మినహాయింపు అందుబాటులో ఉంటుంది. అలాగే, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్ (కీట్రూడా)పై ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి వ్యక్తిగత దిగుమతిదారు సెంట్రల్ లేదా స్టేట్ హెల్త్ సర్వీస్ డైరెక్టర్, జిల్లా మెడికల్ ఆఫీసర్ లేదా జిల్లాలోని సివిల్ సర్జన్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

పన్ను ఎంత?

అయితే ఇటువంటి మందులపై 10 శాతం ప్రాథమిక సుంకం విధించబడుతుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఇంజెక్షన్లపై 5 శాతం పన్ను ఉంచబడుతుంది. వెన్నెముక కండరాల క్షీణత లేదా కండరాల బలహీనత చికిత్స కోసం కొన్ని ఔషధాలకు ఇప్పటికే మినహాయింపు ఇచ్చినప్పటికీ.. ఇతర అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల కోసం కస్టమ్ డ్యూటీ రిలీఫ్ కోసం కేంద్రం అనేక అభ్యర్థనలను స్వీకరించింది. దీని తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు లేదా ప్రత్యేక ఆహార ఖర్చులు ఉన్నాయి. అలాగే వాటిని దిగుమతి చేసుకుంటారు. పీఐబీ ప్రకారం.. కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు సంవత్సరానికి 10 కిలోల బరువున్న పిల్లలకు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. వయస్సు, బరువుతో పాటు ఔషధం మోతాదు, ధర పెరుగుతుంది. ఈ కస్టమ్ డ్యూటీ మినహాయింపు దేశంలోని చాలా మందికి ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి