Nirmala Sitharaman: వీరికి కేంద్రం శుభవార్త అందించనుందా? ఈ పొదుపు పథకాలపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!
మీరు ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలైన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర మొదలైన వాటిలో కూడా పెట్టుబడి పెడితే త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంచిన..
మీరు ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలైన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర మొదలైన వాటిలో కూడా పెట్టుబడి పెడితే త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంచిన తర్వాత, అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాయి. కానీ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. త్వరలో ప్రభుత్వం ఈ పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేటును పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
స్మాల్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్)పై వచ్చిన వడ్డీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మార్చి 31న సమీక్షించనుననారు. ఆ తర్వాత వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఈసారి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లకు సంబంధించిన పొదుపు పథకాలపై వడ్డీని పెంచవచ్చని భావిస్తున్నారు. వచ్చే త్రైమాసికానికి వడ్డీ రేటును సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
వడ్డీ రేటును పెంచాల్సిన అవసరం:
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను చూస్తుంటే వడ్డీ రేటును పెంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈసారి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును సవరించాలనే చర్చ జరుగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొన్ని పొదుపు పథకాలపై వడ్డీని పెంచారు. కానీ కొన్ని స్థిరంగా ఉంచారు. ఇటీవల ఈపీఎఫ్‌వో వడ్డీ రేటును పెంచుతూ ప్రకటన చేసింది.
మార్చి 31న వడ్డీ రేట్లపై సమీక్ష
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని మార్చి 31న సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు అందే వడ్డీ రేటును ఆర్థిక మంత్రి ప్రకటిస్తారు. వడ్డీ రేటును 10-20 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఆర్థిక మంత్రి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో మార్పులు చేశారు. దీని తరువాత, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, సుకన్య సమృద్ధిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
చిన్న పొదుపు పథకాలపై వడ్డీని ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తుంది. వడ్డీ రేటు ద్రవ్యోల్బణం రేటు, బ్యాంకు వడ్డీ రేటు ప్రకారం సమీక్షించబడుతుంది. ఈ వడ్డీ రేట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్ణయించబడతాయి. అక్కడే నోటిఫై చేయబడతాయి. ప్రస్తుతం పీపీఎఫ్‌పై సంవత్సరానికి 7.1%, సుకన్య సమృద్ధిపై 7.6% చొప్పున వడ్డీ లభిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి